- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
బీఆర్ఎస్ బలోపేతానికి సైనికుల్లా పని చేయండి: ఎమ్మెల్యే అబ్రహం
దిశ, ఉండవల్లి: బీఆర్ఎస్ బలోపేతానికి కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలని ఎమ్మెల్యే అబ్రహం పిలుపునిచ్చారు. క్షేత్ర స్థాయిలో కార్యకర్తలను సమన్వయం చేసేందుకే ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తున్నమని తెలిపారు. మండల కేంద్రంలో శనివారం బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జడ్పీ చైర్ పర్సన్ సరిత, ఎమ్మెల్యే అబ్రహం ముఖ్య అతిథిలుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని చెప్పారు. గుణాత్మక మార్పు కోసమే సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లారని తెలిపారు.
అభివృద్ధిలో ముందుకు దూసుకుపోతున్న తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం నిరంకుశ ధోరణులను వ్యతిరేకిస్తూ..ప్రజా సంక్షేమాన్ని దేశవ్యాప్తంగా అందించాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ సారథ్యంలో బీఆర్ఎస్ ఏర్పడిందని తెలిపారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి ప్రజలకు వివరించే బాధ్యత నాయకులు, కార్యకర్తలదేన్నారు. ప్రతిపక్షాలు చేస్తున్న తప్పుడు ప్రచారాలు తిప్పికొట్టాలన్నారు. జడ్పీ చైర్ పర్సన్ సరిత మాట్లాడుతూ.. కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ దేవమ్మ, వైస్ఎంపీపీ దేవన్న సర్పంచులు రేఖ, సురవరం లోకేశ్వర్ రెడ్డి, ఎంపీటీసీలు సుంకన్న, కురుమూర్తి తదితరులు పాల్గొన్నారు.