ఎమ్మెల్యే బీరం గ్రామాలకు వెళ్ళాలంటే ఎందుకు భయపడుతున్నావ్ : మాజీ మంత్రి జూపల్లి

by Kalyani |   ( Updated:2023-11-09 09:44:31.0  )
ఎమ్మెల్యే బీరం గ్రామాలకు వెళ్ళాలంటే ఎందుకు భయపడుతున్నావ్ : మాజీ మంత్రి జూపల్లి
X

దిశ,కొల్లాపూర్: ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డికి గ్రామంలోకి పోవడానికి ముఖం లేదని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. గురువారం కొల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీగా బయలుదేరి కొల్లాపూర్ ఎమ్మార్వో ఆఫీస్ లో ఎన్నికల అధికారి కుమార్ దీపక్ ఆధ్వర్యంలో నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ అనంతరం ఎన్టీఆర్ చౌరస్తాలో నిర్వహించిన రోడ్ షో లో మాజీ మంత్రి మాట్లాడుతూ… ఈఎన్నికలు అవినీతికి, నిజాయితీకి జరుగుతున్న యుద్ధమని రాయలసీమ రౌడీ లాంటి కొందరి రౌడీలాంటి ఇన్స్పెక్టర్లను తీసుకొచ్చి ప్రజలని ఇబ్బందులకు గురి చేస్తూ బూటు కాలుతో తన్నడం, గల్ల పట్టి బయటకు దొబ్బడం వీటన్నిటికీ త్వరలో మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఫైర్ అయ్యారు.

కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి వందల కోట్ల రూపాయలకు అమ్ముడుపోయిన ఎమ్మెల్యేకు తగిన గుణపాఠం చెప్పే రోజు దగ్గర పడిందన్నారు. 80 వేల పుస్తకాలు చదివిన కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని ఖతం చేయాలని చూస్తావా, 88 మంది ఎమ్మెల్యేలు గెలిచిన తర్వాత కూడా ఉన్నటువంటి ప్రతిపక్షం లేకుండా చేయాలని 12 మంది ఎమ్మెల్యేలను కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి కొన్నావంటే ఎవడబ్బ సొత్తు అని ఆగ్రహం చేశారు. కేసీఆర్ నిన్ను ఖతం చేయడానికి తెలంగాణ ప్రజలు రెడీగా ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి హనుమంతు నాయక్, పెద్దకొత్తపల్లి ఎంపీపీ సూర్య ప్రతాప్ గౌడ్, దండు నరసింహ, వంగ రాజశేఖర్ గౌడ్, జూపల్లి అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

👉 Download our Android App
👉Download our IOS App
👉Follow us on Instagram
👉 Follow us on whatsApp channel
👉 Follow us on Share chat

Next Story

Most Viewed