- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తాం
దిశ,కొత్తకోట: అర్హులైన నిరుపేదలకు పార్టీలకు అతీతంగా పాదదర్శంగా ఇందిరమ్మ ఇండ్లను కట్టిస్తామని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అన్నారు. కొత్తకోట మున్సిపాలిటీ కేంద్రంలో తాసిల్దార్ కార్యాలయం ఆవరణంలో ఏర్పాటు చేసిన ఇందిరమ్మ మోడల్ హౌస్ నమూనాకు శుక్రవారం ఎమ్మెల్యే శంకుస్థాపన,భూమి పూజ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ..ఈ సంవత్సరంలో నాలుగు లక్షల 50వేల ఇండ్లును వాటి విధి విధానాలను ప్రభుత్వం అమలు చేయబోతున్నారని అన్నారు. దేవరకద్ర నియోజకవర్గంలో 3,500 ఇండ్లును మంత్రి మంజూరు చేశారని తెలిపారు. కాంగ్రెస్ అంటేనే ఇందిరమ్మ ఇండ్లు అని ఏ ఊరిలో చూసిన ఇందిరమ్మ ఇండ్లే తప్ప ఏ ప్రభుత్వంలో కూడా నిరుపేదలకు ఇల్లు కట్టించలేదని, గత పాలకులు అబద్దాల పునాదుల మీద గద్దెనెక్కి ప్రజలను మోసం చేశారని పేర్కొన్నారు. ఇందిరమ్మ కమిటీల ద్వారా 5 లక్షల రూపాయలతో అర్హులైన అందరికీ ఇండ్లు కట్టిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ పల్లెపాగు ప్రశాంత్, సి. డి. సి చైర్మన్ గొల్ల బాబు, హౌసింగ్ ఏడి విఠోబా, తాసిల్దార్ వెంకటేశ్వర్లు, బోయెజ్, కృష్ణారెడ్డి, బీచుపల్లియాదవ్, మేస్త్రి శ్రీనివాసులు, వేముల శ్రీనివాసరెడ్డి, ఎల్లంపల్లి నరేందర్ రెడ్డి, శేఖర్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.