అభివృద్ధి సంక్షేమ ప్రభుత్వానికి అండగా నిలవాలి : ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి

by Kalyani |   ( Updated:2023-10-29 15:10:48.0  )
అభివృద్ధి సంక్షేమ ప్రభుత్వానికి అండగా నిలవాలి : ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి
X

దిశ, జడ్చర్ల : గడచిన తొమ్మిదేళ్లలో రాష్ట్రంలోని అన్ని వర్గాల అభివృద్ధి సంక్షేమాలకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేసిందని అభివృద్ధి సంక్షేమ ప్రభుత్వానికి అండగా నిలవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. ఆదివారం జడ్చర్ల పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో మిడ్జిల్ మండలం మచిగుండ్లపల్లి గ్రామానికి చెందిన 20 మంది కాంగ్రెస్, బిజెపి పార్టీ నాయకులు జడ్చర్ల మున్సిపాలిటీలోని పాత బజార్ 50 మంది ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి ఎమ్మెల్యే పార్టీ కండువా వేసి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానం పలికారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత పదేళ్లలో నియోజకవర్గంలోని గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణంతో పాటు అభివృద్ధి సంక్షేమ ప్రతి గడపకు చేరాయని ఇది గమనించిన ప్రతిపక్షాల నాయకులు అభివృద్ధి సంక్షేమం వైపే ఉంటామంటూ నిరంతరం బీఆర్ఎస్ పార్టీలో చేరికలు కొనసాగుతున్నాయని రాబోయే 30 రోజులు మరింత కష్టపడి మరింత అభివృద్ధికి బీఆర్ఎస్ పార్టీ గెలుపునకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పార్టీ లో కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు పార్టీలో సుమచితస్థానం ఉంటుందని అన్నారు.

Advertisement

Next Story

Most Viewed