కాగిత రహిత కార్యకలాపాలను కొనసాగించాలి : కలెక్టర్

by Kalyani |
కాగిత రహిత కార్యకలాపాలను కొనసాగించాలి : కలెక్టర్
X

దిశ, నారాయణపేట ప్రతినిధి: ప్రభుత్వ కార్యాలయాలలో కాగిత రహిత ( ఈ - ఆఫీస్) కార్యకలాపాలను కొనసాగించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. రెండు రోజుల క్రితం జిల్లా నూతన కలెక్టర్ గా ఆమె బాధ్యతలు స్వీకరించగా, మంగళవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి అధికారుల పరిచయ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ... అధికారులు తమకు కేటాయించిన శాఖలకు సంబంధించి ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని సూచించారు. గత కలెక్టర్ మాదిరిగానే తాను కూడా అందరూ అధికారుల సహకారంతో జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు.

జిల్లా అధికారుల్లో చాలా మంది సీనియర్ అధికారులు ఉండటం పరిపాలన పరంగా చాలా ఉపయోగ కరంగా ఉంటుందన్నారు. ఇక నుంచి మండల స్థాయిలో ఒక ప్రత్యేక అధికారిని నియమించి ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణ, పర్యవేక్షణ చేస్తానని ఆమె పేర్కొన్నారు. అంతకు ముందు కలెక్టర్ ను పరిచయం చేసుకున్న జిల్లా అధికారులందరూ తమ తమ శాఖలకు సంబంధించిన ప్రగతి పనులు, ప్రభుత్వ లక్ష్యం, ప్రస్తుత స్థితి పై కలెక్టర్ కు నివేదికలను సమర్పించారు.

కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే, ఎస్పీ...

జిల్లా నూతన కలెక్టర్ గా బాధ్యతలు తీసుకున్న సిక్తా పట్నాయక్ ను నారాయణపేట ఎమ్మెల్యే పర్ణిక రెడ్డి, స్థానిక సంస్థల జిల్లా అదనపు కలెక్టర్ మయాంక్ మిత్తల్, ఎస్పీ యోగేష్ గౌతమ్, జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షులు కుంభం శివ కుమార్ రెడ్డి, తదితరులు కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్క అందించి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే బదిలీపై వెళ్లిన కోయ శ్రీ హర్షను పలువురు జిల్లా అధికారులు సింగారం చౌరస్తాలో గల కలెక్టర్ అధికారిక నివాసంలో కలిసి వీడ్కోలు పలికారు.

Advertisement

Next Story

Most Viewed