Gadwal: అదుపు తప్పి చెట్టును ఢీకొట్టిన స్కూల్ బస్సు

by Prasanna |
Gadwal: అదుపు తప్పి చెట్టును ఢీకొట్టిన స్కూల్ బస్సు
X

దిశ,గద్వాల: గద్వాల మండలం పరుమాల గ్రామ స్టేజ్ వద్ద విద్యార్థులతో వెళ్తున్న ఓ‌ స్కూల్ బస్సు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటన మంగళవారం ఉదయం‌ గద్వాల అయిజ రహదారిపై ఉన్న పరుమాల‌స్టేజ్ వద్ద చోటు చేసుకుంది. వివరాలకు వెళ్లితే.. గద్వాల పట్టణానికి చెందిన ప్రగతి విద్యానికేతన్ హై స్కూల్ బస్సులో విద్యార్థులను తీసుకొని మల్దకల్ నుంచి గద్వాలకు వస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు స్కూల్ బస్సు అదుపు తప్పి చెట్టును ఢీ‌కొట్టింది. బస్సులో ఉన్న విద్యార్థులు అందరు క్షేమంగా బయటపడటంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు. స్కూల్ బస్సు ప్రమాదానికి గురికావడంతో విద్యార్థులు భయాందోళనలకు గురయ్యారు. బస్సు బ్రేక్ ఫెయిల్ అవడంతో నే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మరోవైపు ఫిట్నెస్ లేని బస్సుల్లో ప్రైవేటు విద్యాసంస్థలు విద్యార్థులను తరలిస్తున్నప్పటికీ.. రవాణా శాఖ అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరించడం పట్ల పిల్లల తలిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed