- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సమాజాభివృద్ధిలో బ్యాంకుల పాత్ర కీలకం
దిశ, జడ్చర్ల : సమాజ అభివృద్ధిలో బ్యాంకుల పాత్ర కీలకమని,బ్యాంకుల పాత్ర లేనిదే ఏ అభివృద్ధి కూడా సజావుగా జరగదని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి అన్నారు. ఎన్నో జాతీయ బ్యాంకుల మధ్య పోటీపడుతూ పాలమూరు కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ మంచి పేరుతో మనుగడ సాగించి గుర్తింపు పొందడం ప్రశంసనీయమని అన్నారు. ఉమ్మడి జిల్లాలో 26 ఏళ్ల నుంచి పాలమూరు కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ అంటే తెలియని వారు లేరని అన్నారు. శుక్రవారం జడ్చర్ల పట్టణంలోని పాలమూరు కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ప్రైవేట్ లిమిటెడ్ మూడవ బ్రాంచ్ ని బ్రాంచ్ చైర్మన్ కంటే కుమారస్వామి, బ్యాంక్ ఫౌండర్ చైర్మన్ మల్యాల తిమ్మయ్య గుప్తా, ప్రోగ్రాం ఇంచార్జ్ పారాది రామ్మోహన్ తో కలిసి నూతన బ్యాంకును ఎమ్మెల్యే ప్రారంభించారు. ప్రజలకు ఉన్నతమైన సేవలు అందిస్తూ..వారి ఆర్థిక అభివృద్ధికి పాటుపడాలని తెలిపారు. జడ్చర్ల పట్టణ ఆర్థిక అభివృద్ధిలో పాలమూరు కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ పాలుపంచుకోవాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డిసిఎంఎస్ చైర్మన్ పట్ల ప్రభాకర్ రెడ్డి, జడ్చర్ల మున్సిపల్ చైర్పర్సన్ కోనేటి పుష్పలత, డి సి ఓ జాయింట్ రిజిస్టర్ జి శంకర్ చారి, మున్సిపల్ వైస్ చైర్మన్ పాలాది సాధికార రామ్మోహన్ బాదేపల్లి, జాతీయ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ జ్యోతి అల్వాల్ రెడ్డి, బ్యాంక్ వర్కింగ్ ప్రెసిడెంట్ గోపాల్ స్వామి, బ్యాంక్ మాజీ చైర్మన్ కృష్ణయ్య బ్యాంక్ సీఈవో రాజేంద్రకుమార్ స్థానిక కౌన్సిలర్లు వివిధ పార్టీల నాయకులు ఆర్యవైశ్య సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.