- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వికలాంగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి
దిశ, వనపర్తి టౌన్: స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన వికలాంగ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని వికలాంగుల హక్కుల పోరాట సమితి వనపర్తి జిల్లా అధ్యక్షులు గోపీనాథ్ డిమాండ్ చేశారు. శనివారం స్థానిక ఎంపీడీవో కార్యాలయం ఎదుట వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో..రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి సర్కార్ అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్లు పెంచుతానని మాట ఇచ్చి..వికలాంగులకు, వృద్ధులకు, వితంతువులకు మోసం చేస్తున్నారన్నారు. పెంచుతామన్న పెన్షన్లు పెంచకుండా వారిని అన్యాయం చేస్తున్నారని ధ్వజమెత్తారు . వికలాంగుల రిలే నిరాహార దీక్షకు మద్దతుగా బీఆర్ఎస్ నాయకులు, బీజేపీ నాయకులు నిలిచారు. ఈ కార్యక్రమంలో వెంకటస్వామి, గట్టు స్వామి, మహాజన సోషలిస్ట్ పార్టీ నాయకులు ప్రభాకర్ శెట్టి, కృష్ణవేణి, జిల్లా సీనియర్ నాయకులు గంధం గట్టయ్య, తదితరులు పాల్గొన్నారు.