- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Jurala : జూరాలకు గంటగంటకు పెరుగుతున్న వరద తీవ్రత
by Aamani |
X
దిశ,మహబూబ్ నగర్ బ్యూరో: ఉమ్మడి పాలమూరు జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు వరద తీవ్రత గంట గంటకు పెరుగుతుంది. 9.657 టీఎంసీల కెపాసిటీ గల ఈ ప్రాజెక్టుకు గత వారం రోజులుగా కర్ణాటకలో కురుస్తున్న వర్షాల కారణంగా కృష్ణమ్మ పరవళ్ళు తొక్కుతూ జూరాలకు చేరుకోవడంతో పూర్తిస్థాయిలో నిండింది. కర్ణాటకలో వర్షాలు విస్తారంగా కురుస్తున్న కారణంగా ఆల్మట్టి డ్యాం నుంచి రెండు లక్షల 50 వేల క్యూసెక్కుల నీటిని గురువారం ఉదయం విడుదల చేశారు. నది తీవ్రత పెరిగిన కారణంగా గురువారం ఉదయం 10:30 గంటలకు జూరాల ప్రాజెక్టు 46 గేట్లను ఎత్తివేసి రెండు లక్షల పైగా క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. నెట్టెంపాడు, బీమా ప్రాజెక్టులకు లిఫ్టుల ద్వారా నీటిని ఎత్తిపోస్తున్నారు. కృష్ణ నది ప్రవాహ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
Advertisement
Next Story