- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ధాన్యం రవాణా టెండర్లు నిలిపివేయాలంటూ..హైకోర్టు స్టే
దిశ నాగర్ కర్నూల్ :- నాగర్ కర్నూల్ జిల్లాలోని కల్వకుర్తి, అచ్చంపేట, కొల్లాపూర్, నాగర్ కర్నూల్ డివిజన్ పరిధిలోని రైతులు పండించిన వరి ధాన్యాన్ని ఆయా గోడౌన్, రైస్ మిల్లులకు ధాన్యం, ధాన్యం రవాణా కోసం బుధవారం కలెక్టరేట్లో నిర్వహించిన టెండర్ల ప్రక్రియలో రసాభాస చోటుచేసుకుని ఉద్రిక్తత ఏర్పడిన విషయం పాఠకులకు విదితమే. దీంతో కొంతమంది బాధితులు వరి ధాన్యాన్ని సరఫరా చేసేందుకు సివిల్ సప్లై శాఖ నిర్వహించిన టెండర్లు నిబంధనలకు విరుద్ధంగా జరిగాయని, బాధితులు హైకోర్టును ఆశ్రయించగా శనివారం టెండర్ ఫలితాలను నిలుపుదల చేయాలని హైకోర్టు స్టే విధించింది.
ఈ నేపథ్యంలో ఆన్లైన్ ద్వారా సుమారు 20కి పైగా దాఖలైన టెండర్లు ఈ నెల 12న ఆఫ్ లైన్ ద్వారా నేరుగా కార్యాలయంలో టెండర్లను వేసేందుకు వెళ్లిన టెండర్ దారులను కొంతమంది పొలిటికల్ లీడర్లు బలవంతంగా వారిపై దౌర్జన్యం చేస్తూ టెండర్లు దాఖలు కాకుండా ఇబ్బందులకు గురి చేశారు. ఇదంతా పోలీస్ అధికారుల కళ్ల ముందే జరిగిన పట్టించుకోలేదని బాధితులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు టెండర్ ఫలితాలను నిలుపుదల చేయాలంటూ స్టే విధిస్తూ ఆయా శాఖ జిల్లా అధికారులకు ఆదేశాలు ఇచ్చింది.