‘ఉపాధి హామీ’ కూలీ హఠాన్మరణం..

by Kalyani |
‘ఉపాధి హామీ’ కూలీ హఠాన్మరణం..
X

దిశ, నవాబుపేట: నవాబుపేట పోలీస్ స్టేషన్ పరిధి కొత్తపల్లి తండాకు చెందిన ఉపాధి కూలీ లోక్య నాయక్ (41) మంగళవారం హఠాన్మరణం చెందాడు. కూలీలతో కలిసి అడవిలోకి వెళ్లిన ఆయనకు ఉపాధి పనులు చేస్తుండగా చాతి నొప్పి రావడంతో ఆటోలో హుటాహుటిన చౌడాపూర్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. ఆస్పత్రిలో ఆయనను పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లుగా తెలిపారు. లోక్య నాయక్ కు భార్య బేబీ, ఇద్దరు కుమారులు ఉన్నారు. లోక్య నాయక్ మృతితో ఆయన కుటుంబం పెద్దదిక్కును కోల్పోయిందని, ప్రభుత్వం ఆయన కుటుంబాన్ని ఆదుకోవాలని తండావాసులు కోరుతున్నారు.

Next Story