ప్రభుత్వం రైతుల భూములు లాక్కొని వారి కళ్ళల్లో మట్టి కొడుతుంది – ఈటల రాజేందర్

by Kalyani |   ( Updated:2023-09-13 11:22:58.0  )
ప్రభుత్వం రైతుల భూములు లాక్కొని వారి కళ్ళల్లో మట్టి కొడుతుంది – ఈటల రాజేందర్
X

దిశ, అచ్చంపేట : ఈ ప్రభుత్వం ప్రాజెక్టుల పేరుతో పేద రైతుల భూములను అతి తక్కువ ధరలకు అప్పనంగా లాక్కుంటూ.. పేద రైతుల కళ్ళల్లో మట్టికొడుతుందని,అందుకు మరో ఉదాహరణ నాగర్ కర్నూల్ జిల్లా కొమ్మెర గ్రామానికి చెందిన రైతు అనంత అల్లోజు తనకున్న 19 ఎకరాల భూమి ప్రాజెక్టులో పోగొట్టుకొని అందుకు తగిన పరిహారం అందక ఆత్మహత్య పాల్పడానికి ముమ్మాటికి సీఎం కేసీఆర్ ఏ కారణమని బీజేపీ రాష్ట్ర ఎన్నికల పరిశీలకులు ఈటల రాజేందర్ ధ్వజమెత్తారు.

బుధవారం నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం బీజేపీ బూత్ సాయి కార్యకర్తల సమావేశానికి ఈటల రాజేందర్ ముఖ్య అతిథిగా హాజరై ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రధాని మోడీ 148 కోట్ల ప్రజలకు సేవకుడని చెప్పుకుంటారని అన్నారు.కానీ అదే సీఎం కేసీఆర్ రైతుబంధు, దళిత బంధు, కేసీఆర్ కిట్టు, కళ్యాణ లక్ష్మి లాంటి పథకాలకు కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించిన కేంద్రం గురించి ఒక్క మాట మాట్లాడకుండా వివిధ రూపాలలో నేనే ఇస్తున్నానని తప్పుడు ప్రచారానికి పూనుకున్నాడని ఆయన మండిపడ్డారు.బీజేపీ పార్టీ కుటుంబ పార్టీ కాదని, అదే బీఆర్ఎస్ పార్టీ సీఎం కేసీఆర్, ఆయన కొడుకు, కూతురు, అల్లుళ్లకు ఒకే కుటుంబంలో నాలుగైదు మంత్రి పదవులు పొందే నైజం కేసీఆర్ దన్నాడు.


గజ్వేల్ లో బొంద పెడతాం..


ఈ సందర్భంగా హుజరాబాద్ లో నన్ను ఓడించేందుకు వేలాది కోట్ల రూపాయలు ఖర్చు చేసిన సొమ్ము ఎక్కడినుంచి తెచ్చావు చెప్పే ధైర్యం నీకు ఉందా అని సీఎం కేసీఆర్ కు రాజేందర్ సవాల్ విసిరారు. ఆయన బానిసలు వచ్చి అక్కడ పని చేసిన కూడా అరే..నా కొ... అక్కడ గెలిచేది లిక్కర్ కాదు బిడ్డ.. హుజూరాబాద్ లో ఆత్మ గౌరవం గెలిచిందన్నారు. నా చూపుంత చిన్నాచితక నాయకత్వంపై కాదని కొడితే కొండని కొట్టాలి రాబోయే ఎన్నికల్లో గజ్వేల్ లో బీఆర్ఎస్ పార్టీని బొంద పెడతామని సీఎం కేసీఆర్ పై ఘాటైన వాక్యాలు చేశారు.

అచ్చంపేట తో పాటు రాష్ట్రమంతటా ముదిరాజులు భగ్గుమంటున్నారు బిడ్డ, ముదిరాజ్ బిడ్డలకు ఒక్క సీటు కూడా కేటాయించలేదని మా ఒక్క ఓటు కూడా నీకు వేయమంటూ శపథం చేస్తూ సమాయత్తమవుతున్నారని ఆయన హెచ్చరించారు.ప్రభుత్వం గెస్ట్ లెక్చరర్ల వేతనాలు మంజూరు చేయకుండా వాళ్ళ ఉసురు పోసుకుంటుందని, జీతాలు పడక వారి కుటుంబాలు గగ్గోలు పెడుతున్న నీకు చీమకుట్టినట్టు లేదని.. నీవు దళిత సీఎంను ప్రకటిస్తా అని మోసం చేశావని, నీవు ప్రవేశపెట్టే పథకాలు మొత్తం కేంద్ర ప్రభుత్వ సొమ్ముతో సోకులు పడుతున్నావని.. ఈ తెలంగాణ గడ్డపై ఏ ఒక్క జాతి సంతృప్తిగా లేదన్నారు.

ఓట్లు వేసేది సీఐ, అధికారులు కాదు ?

రాష్ట్రంలో దరిద్ర పాలన కొనసాగుతుందని పోలీసులు వ్యవస్థ ఇతర శాఖ అధికారులు అధికార పార్టీకి వత్తాసు పలుకుతూ వివిధ సందర్భాలలో కార్యకర్తలను భయభ్రాంతులకు గురిచేసి అధికార పార్టీ అనుకూలంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేస్తున్న తీరు అమానుషమని, నీకు ఓట్లు వేసేది పోలీస్ వ్యవస్థలో ఉన్న సీఐ,ఇతర అధికారులు కాదు బిడ్డ అంటూ మండిపడ్డారు. గ్రామ గ్రామాన లిక్కర్లే పారుతుందని, నీ డబ్బులు, లిక్కర్కు ఓట్లు పడవు బిడ్డ అని ఘాటుగా విమర్శించారు.

బీజేపీ అధికారంలోకి వస్తే..

బీజేపీ పార్టీ అధికారంలోకి తీసుకురావడానికి ప్రతి కార్యకర్త సిద్ధంగా ఉన్నారని, బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తే 50 ఏళ్లు దాటిన వారి కుటుంబంలో ఇద్దరికీ పెన్షన్, రైతు పండించిన ధాన్యం అంతా కొంటుందని, నీలాగా కోతలు ఉండవని మాటల్లో సీఎం కేసీఆర్ బంగారు తెలంగాణ అని మాటల్లో చూపుతున్నాడు.. కానీ బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేతల్లో చూపెడుతుందన్నారు.కావున వారిని ఆశీర్వదించాలని అచ్చంపేటలో బీజేపీ జెండా ఎగరవేసేందుకు ప్రతి కార్యకర్త నిత్యం పని చేయాలని పిలుపునిచ్చారు. అంతకుముందు ఎస్సీ నియోజకవర్గాల ఇన్చార్జి బీజేపీ పార్టీ జాతీయ నాయకులు మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి మాట్లాడుతూ.. అచ్చంపేటలో ఎవరికి టికెట్ ఇచ్చినా కలిసి పనిచేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.


కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దదించాలని మన కార్యకర్తలకు పోలీస్ స్టేషన్కు వెళ్తే సలాం పెట్టాలని తహసీల్దార్,​ ఎంపీడీవో కార్యాలయం వెళితే లేచి నిలబడాలా చేద్దాం అని కార్యకర్తలకు హిత బోధ చేశారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా 12 లక్షల ఎకరాలకు సాగునీరు ఏమైంది బిడ్డ మరోసారి పాలమూరు బిడ్డల చెవులలో పువ్వు పెట్టేందుకు సీఎం కేసీఆర్ ఈనెల 16న వస్తున్నారని పై ప్రాజెక్టులో 9 మోటర్లు ఉంటే కేవలం ఒకే ఒక మోటారు ద్వారా ఎలా అన్ని లక్షల ఎకరాలకు సాగునీరు ఇస్తామని సూటిగా ప్రశ్నించారు.

18 రాష్ట్రాలలో బీజేపీ పాలన అవినీతిమయం లేకుండా కొనసాగుతుందని అలాంటి తెలంగాణలో రావాలని కోరుకున్నారు. తదుపరి బీసీ కమిషన్ చైర్మన్ సభ్యులు ఆచారి మాట్లాడుతూ అవినీతి డబ్బుతో నాయకులు అధికారంలోకి రావడానికి కలలు కంటున్నారని బీఆర్ఎస్ ఒడక తప్పదు బీజేపీరాక తప్పదని ఆయనన్నారు.సారా కూరా కారా బీఆర్ఎస్ పార్టీ విధానం అయితే ఈ రాష్ట్రంలో ప్రతి పథకానికి అన్ని మోడీ ఇస్తే దివ్యమిచ్చావ్ బూ.. తప్ప ఏమీ లేదన్నాడు. ప్రతి కార్యకర్త 100 ఓట్లు వేయించి అచ్చంపేటలో బీఆర్ఎస్ పార్టీని బొంద పెట్టాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు బంగారు శృతి, వేముల నరేందర్, కొప్పు భాష, శ్రీకాంత్ బీమా, సతీష్ మాదిగ, రేనయ్య, మంగ్యా నాయక్, బల్మూర్ జానకి, నాగరాజు, బూత్ స్థాయి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed