- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
drunkars : తాగుబోతులకు అడ్డగా ఆలయాలు, విద్యాలయాలు..
దిశ, అయిజ : జోగులాంబ గద్వాల జిల్లా అయిజలో తాగుబోతులకు దేవాలయాలు, విద్యాలయాలు ప్రధాన స్థావరాలను అడ్డాగా మార్చుకొని ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. ఈ స్థావరాలకు రక్షణ గోడలు, కాపలాదారులు లేక ఎక్కడ పడితే అక్కడ మద్యం సేవించి, యువకులు తాగిన మత్తులో సీసాలు పగలగొట్టడం, ద్విచక్ర వాహనాలు అతి వేగంగా నడుపుతూ దారిన పోయే వారికి ఇబ్బంది కలుగజేస్తున్నారు. అయిజలోని BUPS పాఠశాల వెనుక మైదానంలో తాగి సీసాలు పగలగొట్టడం వల్ల పాఠశాల విద్యార్థులకు అనేకసార్లు గాయాలు అవుతుంటాయి.
అంతేగాక ఇక్కడ రాత్రి 11 గంటలు దాటితే అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని కొందరు స్థానికులు చెబుతున్నారు. ప్రక్కనే ఉన్న హరిజనవాడ పాఠశాలలో గతంలో దొంగతనం కూడా జరిగిందని వినికిడి. ఇటువంటి కొన్ని స్థావరాలలో అల్లరిమూకలు చేస్తున్న ఆగడాలకు అంతులేకుండా పోతుందని వీటిని అరికట్టాలంటే పోలీసుల పర్యవేక్షణ చాలా అవసరమని కావున పోలీసులు రాత్రిపూట ఇటువంటి స్థావరాలలో నిఘా ఉంచాలని స్థానికులు కోరుతున్నారు.