- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
మురికి నీళ్లు వస్తున్నాయంటూ గ్రామస్థుల ఆందోళన

X
దిశ, తెలకపల్లి: మంచి నీళ్లకు బదులు మురికి నీళ్లు వస్తున్నాయంటూ తెలకపల్లి గ్రామస్థులు ఆందోళన నిర్వహించారు. అనంతరం ఈవో భాస్కర్, గ్రామ కార్యదర్శికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా గ్రామస్థుడు పవన్ కుమార్ మాట్లాడుతూ.. కొద్ది రోజుల నుంచి మంచి నీళ్లలో పురుగులు, చెత్తచెదారం వస్తోందని వాపోయారు. ఈ గత్యంతరం లేక ఈ నీళ్లనే తాగాల్సి వస్తోందని, దీంతో గ్రామస్థులు రోగాల బారిన పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయమై ప్రజా ప్రతినిధులు, అధికారులకు ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే స్వచ్ఛమైన తాగునీరు వచ్చేలా అధికారులు, ప్రజాప్రతినిధులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మల్లేశ్, భోగరాజు రమేశ్, భాషను మల్లేశ్, రెడ్డపాకుల శివశంకర్, సందీప్, లక్ష్మణ్, శివ తదితరులు పాల్గొన్నారు.
Next Story