చిలుకూరు నుంచి శ్రీశైలానికి పాదయాత్ర చేస్తున్న టీడీపీ నాయకులు..

by Sumithra |
చిలుకూరు నుంచి శ్రీశైలానికి పాదయాత్ర చేస్తున్న టీడీపీ నాయకులు..
X

దిశ, అచ్చంపేట : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ఎన్నికవ్వడంతో రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండల ఇంచార్జి ఏల్లని యాదయ్య గౌడ్ ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు ఈ నెల 14 నుండి శ్రీశైలం ఆలయానికి పాదయాత్ర ప్రారంభించారు. ఈ నేపథ్యంలో గురువారం నాటికి నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మన్ననూర్ గ్రామానికి పాదయాత్ర చేరుకున్నది. పాదయాత్ర చేస్తున్న టీడీపీ నాయకులకు అచ్చంపేట టీడీపీ నాయకులు పార్లమెంటు ఉపాధ్యక్షులు వెంకటరమణ, సత్యనారాయణ, ఇస్మాయిల్, మునీర్ తదితరులు స్వాగతం పలికారు. అనంతరం అంబేద్కర్ కు పూలమాలవేసి వారి పాదయాత్రను కొనసాగించారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు రాజశేఖర్ రావు, పాండు, మల్లేషు, గణేషు, మునీర్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed