ఈ నెల 28న జరిగే జాతీయ లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోండి

by Kalyani |
ఈ నెల 28న జరిగే జాతీయ లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోండి
X

దిశ ప్రతినిధి,మహబూబ్ నగర్: జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల వారిగా రాజీ పడదగిన కేసులను గుర్తించి జాతీయ లోక్ అదాలత్ లో ఎక్కువ మొత్తంలో పరిష్కారం జరిగేలా కృషి చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.పాపిరెడ్డి సూచించారు. శుక్రవారం ఆయన జిల్లా లోక్ అదాలత్ భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర న్యాయ సేవా అధికార సంస్థ ఆదేశానుసారం ఈ నెల 28 న జరిగే జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంలో రాజీ పడదగిన క్రిమినల్ కాంపౌడబుల్ కేసులు,యాక్సిడెంటల్ కాంపన్షేషన్, ప్రీ లిటిగేషన్, ఎలక్ట్రిసిటి, భూ వివాదాలు, ట్రాఫిక్ చలాన్, చెక్ బౌన్స్ కేసులు చట్ట ప్రకారం రాజీ కుదర్చడం జరుగుతుందని జడ్జి వివరించారు. ఈ లోక్ అదాలత్ లో రాజీ కుదిర్చిన కేసులకు అప్పీలు ఉండదని, కోర్టు ఫీజు కూడా తిరిగి వాపస్ ఇవ్వబడుతుందని ఆయన తెలిపారు. జాతీయ లోక్ అదాలత్ లో వీలైనన్ని ఎక్కువ మొత్తంలో కేసులను పరిష్కరించేందుకు గ్రామీణ ప్రాంతాల వారీగా విస్తృతంగా ప్రచారానికి ప్రాముఖ్యత ఇవ్వాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో ఇంచార్జీ జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి ఇందిర పాల్గొన్నారు.

Advertisement

Next Story