- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
స్వీప్ కార్యక్రమాలు నిర్వహించాలి : జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్
దిశ, నాగర్ కర్నూల్ కలెక్టరేట్ : యువ ఓటర్లను ప్రోత్సహింస్తూ రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో 100% ఓటింగ్ సాధించడానికి భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాలో వివిధ సిస్టమాటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్, ఎలక్టోరల్ పార్టిసిపేషన్ (స్విప్) కార్యకలాపాలను విరివిగా నిర్వహించాలని నాగర్ కర్నూల్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో రాష్ట్రస్థాయి స్విప్ నోడల్ అధికారి భవాని శంకర్‌తో కలిసి స్విప్ కార్యక్రమాలపై జిల్లాస్థాయి నోడల్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.... ఓటర్ల నమోదుకు జనవరి 1, 2024 ప్రామాణికంగా తీసుకుని అప్పటికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరిని ఓటరు జాబితాలో చోటు కల్పిస్తూ ఓటరు జాబితా రూపొందించామని, అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా నూతనంగా నమోదైన ఓటర్ల జాబితా వివరాలను మరోసారి ధ్రువీకరించుకోవాలని అధికారులకు సూచించారు.