రేపే మిడ్జిల్ ఎంపీపీ ఎన్నిక..

by Sumithra |
రేపే మిడ్జిల్ ఎంపీపీ ఎన్నిక..
X

దిశ, మిడ్జిల్ : మిడ్జిల్ మండల ఎంపీపీ ఎన్నికకు అధికారులు శనివారం నోటిఫికేషన్ విడుదల చేశారు. మిడ్జిల్ మండల ఎంపీపీగా ఉన్నకాంతమ్మ వ్యక్తిగత కారణాలవల్ల జనవరి 30వ తేదీన తన ఎంపీపీ పదవికి రాజీనామా చేశారు. దీంతో మిడ్జిల్ మండల ఎంపీపీ పదవి కాళీ ఏర్పడింది. ఫిబ్రవరి నెలలో ఎంపీపీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీగా అవతరించిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ అందుబాటులోకి రాకపోవడంతో మిడ్జిల్ ఎంపీపీ ఎన్నిక మరోసారి వాయిదా పడింది. దీంతో మిడ్జిల్ మండల వైస్ఎంపీపీగా ఉన్న తిరుపతమ్మ మండల ఇంచార్జి ఎంపిక బాధ్యతలు స్వీకరించారు. బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ అందుబాటులోకి రావడంతో మండల ఎంపీపీ ఎన్నికకు ఎన్నికల అధికారులు నోటిఫికేషన్ జారీ చేశారు. శనివారం మిడ్జిల్ మండల ఎంపీపీ ఎన్నిక నిర్వహించనున్నారు.

రాష్ట్రంలో తొలి బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ సుదర్శన్ కే..

టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీగా అవతరించిన తర్వాత రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ తొలి బీ ఫారంను మిడ్జిల్ మండలం వాడియాల్ ఎంపీటీసీ సుదర్శన్ బరిగెల అందుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ తొలి బీఫామ్ ద్వారా శనివారం బీఆర్ఎస్ ఎంపీపీగా సుదర్శన్ పరిగెల ఎన్నిక కానున్నారు. రాష్ట్రంలోనే బీఆర్ఎస్ తొలి బీఫామ్ తనకే దక్కడంపట్ల సుదర్శన్ సంతోషం వ్యక్తం చేశారు.

ఎంపీపీగా బి.సుదర్శన్ ఎన్నిక లాంచనమే..

మిడ్జిల్ ఎంపీపీ టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎంపీటీసీ సుదర్శన్ ఎన్నిక లాంచనమే. మిడ్జిల్ మండల ఎంపీపీ పదవి ఎస్సీ జర్నల్ రిజర్వ్ కేటాయించారు. మిడ్జిల్ మండలంలో మొత్తం తొమ్మిది మంది ఎంపీటీసీలు కాగా అందులో బీఆర్ఎస్ పార్టీకి చెందిన నలుగురు కాంగ్రెస్ పార్టీకి చెందిన నలుగురు ఎంపీటీసీ గెలుపొందగా. బీజేపీ పార్టీకి చెందిన ఒకరు ఎంపీటీసీగా గెలుపొందారు. బీజేపీ మద్దతుతో కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ ఆయన కాంతమ్మ మిడ్జిల్ మండల ఎంపీపీగా బాధ్యతలు స్వీకరించింది. జనవరి నెలలో కాంతమ్మ వ్యక్తిగత కారణాలవల్ల ఎంపీపీ పదవికి రాజీనామా చేయడంతో మిడ్జిల్ మండల ఎంపీపీ పదవి ఖాళీ ఏర్పడింది. బీఆర్ఎస్ పార్టీ నుండి ఎస్సీ ఎంపీటీసీ సుదర్శన్ మాత్రమే ఉండడంతో ఇదివరకే రాజీనామా చేసిన మాజీఎంపీపీ కాంతమ్మ పోటీ చేయడానికి ఆసక్తి చుప్పకపోవడంతో మిగిలిన ఏకైక దళిత ఎంపీటీసీ అయినా సుదర్శన్ ఎంపీపీ ఎన్నిక లాంచనంగానే మారింది.

ఉద్యమ నాయకుడికి తగిన గౌరవం..

2001 నుండి తెలంగాణ ఉద్యమ నాయకుడు కేసీఆర్ పిలుపు మేరకు నాటి నుండి నేటి వరకు పార్టీ కోసం నిబద్దతతోపని చేస్తున్న వాడియాల్ (మున్ననూర్, రాణిపెట్) ఎంపీటీసీ సుదర్శన్ బరిగెలకు బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత తొలి బిఫాంను అందుకున్నారు. దీంతో పార్టీ కోసం కష్టపడ్డ నాయకుడికి తగిన గౌరవం దక్కడంతో సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సుదర్శన్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో రెండు సార్లు గెలిపించిన వడియాల్, మున్ననూర్, రాణి పెట్ గ్రామల ప్రజలందరికీ జీవితం రుణపడి ఉంటానని.

నాపై ఎంతోనమ్మకంతో గతంలో వైస్ ఎంపీపీగా మళ్ళీ ఇప్పుడు మిడ్జిల్ ఎంపీపీగా అవకాశం కల్పించిన జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ సి.లక్ష్మారెడ్డికు కృతజ్ఞతలు తెలిపారు. తన ఎన్నికకు సహకరిస్తున్న మండలంలోని అన్ని గ్రామాల ప్రజాప్రతినిధులు నాయకులు బీఆర్ఎస్ జిల్లామండల, గ్రామల ముఖ్యనాయకులు కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. ప్రతినిత్యం అందరికి అందుబాటులో ఉండి ప్రజాసేవలో ఉంటానని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed