- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘ఉదండాపూర్' పనులు తక్షణమే ప్రారంభించండి: కలెక్టర్ రవి నాయక్
దిశ, మహబూబ్ నగర్: పాలమూరు-రంగారెడ్డి ఎత్తి పోతల పథకంలో భాగంగా ఉదండాపూర్ పునరావాస కేంద్రంలో తక్షణమే అన్ని శాఖలు పనులు ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ జి. రవి నాయక్ ఆదేశించారు. బుధవారం ఆయన ఉదండాపూర్ ఆర్ అండ్ ఆర్ సైటును సందర్శించి పనులను తనిఖీ చేశారు. అక్కడ మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా ఆయా ఇంజనీరింగ్ శాఖల ద్వారా ఇప్పటివరకు చేపట్టిన పనులపై ఆయన ఆరా తీశారు. త్వరితగతిన పనులు పూర్తి చేసేందుకు ఎక్కువ మంది లేబర్ ను నియమించాలని, అలాగే మెటీరియల్ ముందే డంప్ చేసుకోవాలని ఆయన ఆదేశించారు. సైట్ కు వచ్చే ఇరువైపు ప్రధాన రహదారులకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి పూర్తిచేయాలని సూచించారు.
అక్కడ నిర్మించనున్న పాఠశాలలు, అంగన్వాడి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, వైకుంఠ దామం తదితర పనులకు సంబంధించి కాంట్రాక్టర్లు గతంలో టెండర్లు వేసి పనులు చేసేందుకు ముందుకు రానందున ఆగిపోయాయని, ఆయా ఇంజనీరింగ్ విభాగాల ఇంజనీర్లు జిల్లా కలెక్టర్ దృష్టి తీసుకురాగా, తక్షణమే వారందరితో సమావేశం ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. అలాగే కొన్ని పనులు విద్యుత్ కనెక్షన్ వల్ల ఆగిపోయాయని తెలుసుకుని విద్యుత్ ఇంజనీరింగ్ అధికారులతో మాట్లాడుతూ తక్షణమే విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయాలని, ఆర్ అండ్ ఆర్ కేంద్రంలో సబ్ స్టేషన్ ఏర్పాటుకు వెంటనే ప్రతిపాదనలు పంపించాలని ఆదేశాలు జారీ చేశారు.
పంచాయతీరాజ్, మిషన్ భగీరథ, టీఎస్ఎంఐడీసీ తదితర శాఖల ద్వారా చేపట్టాల్సిన పనులపై ఆయన సమీక్షించారు. మిషన్ భగీరథ ద్వారా నిర్మించనున్న ఓహెచ్ బీఆర్ కు స్థలాన్ని ఫైనల్ చేయాలని అధికారులతో కోరారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ కె.సీతారామారావు, ఆర్డీఓ అనిల్ కుమార్, పంచాయతీరాజ్ ఎస్ఈ శివకుమార్, మిషన్ భగీరథ ఎస్ఈ వెంకటరమణ, ఈఈలు పుల్లారెడ్డి, వెంకట్ రెడ్డి, డీఈలు నరేందర్ రెడ్డి, జైపాల్ రెడ్డి, జడ్చర్ల తహసీల్దార్ లక్ష్మీనారాయణ తదితరులు ఉన్నారు.