Collector : రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక శ్రద్ధ వహించాలి

by Kalyani |
Collector : రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక శ్రద్ధ వహించాలి
X

దిశ ప్రతినిధి,మహబూబ్ నగర్: జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి అధికారులకు ఆదేశించారు. గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల పట్ల ఏర్పాటు చేసిన రోడ్డు భద్రత జిల్లా స్థాయి సమావేశంలో ఆమె మాట్లాడారు.రోడ్డు భద్రత అనేది అత్యంత ప్రాధాన్యమైనదని,మానవ తప్పిదాల వల్ల అనేక రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయని, ప్రమాదాలలో 18 నుంచి 45 సంవత్సరాల లోపు వారే ఎక్కువగా చనిపోతున్నారని, వీటిని నివారించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. నేషనల్ హైవే 44, 167 స్టేట్ హైవే 20 పై పోలీస్ శాఖ అధికారుల ద్వారా కనుగొన్న బ్లైండ్ స్పాట్ల వద్ద రేడియం స్టికర్లతో కూడిన సూచికలను ఏర్పాటు చేయాలని సూచించారు.

రహదారుల పై అవసరమైన చోట వాహన వేగాన్ని నియంత్రించే స్పీడ్ బ్రేకర్స్ లను ఏర్పాటు చేయాలని,కెమెరాలు, లైట్లు, స్పీడ్ కెమెరాలు, పాదచారులు రోడ్డు దాటే దగ్గర జీబ్రా క్రాసింగ్, లైటింగ్, రోడ్డు రిఫ్లెక్టింగ్ లైట్లు, తమ వాహనం ఎంత వేగంతో వెళ్తున్నది వాహన చోదకున్ని అలెర్ట్ చేసేలా రోడ్లపై వేగాన్ని సూచించే డిజిటల్ బోర్డులను ఏర్పాటు చేయాలని, అవసరమైన చోట్ల సర్వీస్ రోడ్డు వేసేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్ సూచించారు. సమావేశంలో ఎస్పీ జానకి,అదనపు కలెక్టర్లు శివేంద్ర ప్రతాప్, మోహన్ రావు ,అడిషనల్ ఎస్పీ రాములు, రవాణాశాఖ అధికారి, డీఎస్పీ వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి, ఆర్ అండ్ బి ఈఈ, ఎల్ అండ్ టి, తదితర ఆయా సంస్థల, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Next Story