- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఆటలు.. పాటలు.. సహపంక్తి భోజనాలు : వినూత్న కార్యక్రమానికి ఎమ్మెల్యే ఆల శ్రీకారం
దిశ బ్యూరో, మహబూబ్ నగర్: కళాకారుల ఆటలు.. పాటలు.. పార్టీ శ్రేణుల నినాదాల మధ్య దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి, ఆల మంజుల దంపతులు సోమవారం భూత్పూర్ మండలం కొత్త ముల్గర శివారులో బీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు, కుటుంబ సభ్యులతో కలిసి ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు. కేవలం భూత్పూర్ మండల, మునిసిపాలిటీ పరిధిలోని గ్రామాలు, వార్డుల నుంచి దాదాపుగా ఎనిమిది వేల మందికి పైగా పార్టీ శ్రేణులు, అభిమానులు తమ కుటుంబ సభ్యులతో తరలివచ్చారు.
ఒకవైపు డప్పుల మోతలు మరోవైపు కళాకారుల నృత్యాలు.. మహిళల బతుకమ్మ ఆట, పాటలు ప్రముఖ కళాకారుడు రాష్ట్ర గిడ్డంగుల శాఖ చైర్మన్ సాయికుమార్ పాటతో కార్యక్రమం ఉత్సాహంగా ఉల్లాసంగా సాగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెంకటేశ్వర్ రెడ్డి భావోద్వేగంతో తన తండ్రి ఆల రఘుపతి రెడ్డి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తల నిరంతర పట్టుదల, సేవలతో ఎమ్మెల్యేగా గెలిచి సీఎం సహకారంతో నియోజకవర్గానికి సేవ చేసే భాగ్యం దొరికిందన్నారు.
అనంతరం కార్యక్రమానికి హాజరైన ప్రజలకు సహపంక్తి భోజనాలను ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే దంపతులు స్వయంగా వారికి భోజనాలు వడ్డించి అందరిలో కొత్త ఉత్సాహాన్ని నింపారు. ఆత్మీయ సమ్మేళనం దిగ్విజయం కావడంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో రెట్టించిన ఉత్సాహం నెలకొంది. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి, ఎంపీపీ కదిరే శేఖర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ బసవరాజ్ గౌడ్, జిల్లా ముఖ్యకార సంఘం అధ్యక్షుడు సత్యనారాయణ, నాయకులు సత్తూరు నారాయణ గౌడ్, చంద్రశేఖర్ గౌడ్, శ్రీనివాస్ రెడ్డి, నర్సింహులు గౌడ్, మురళీధర్ గౌడ్, గోపులాపూర్ సత్యనారాయణ, వివిధ గ్రామాల సర్పంచ్ లు, ఎంపీటీసీలు, తదితరులు పాల్గొన్నారు.