నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తా - సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

by Kalyani |   ( Updated:18 Oct 2023 9:53 AM  )
నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తా - సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
X

దిశ,వనపర్తి : నిత్యం ప్రజల మధ్యనే ఉంటూ సమస్యలు పరిష్కరిస్తూ,నియోజకవర్గం అభివృద్ధి కోసం కృషి చేసానని, ఇకముందు కూడా ప్రజాభిష్టం మేరకే పనిచేస్తామని వనపర్తి నియోజకవర్గం బీఅర్ఎస్ అభ్యర్థి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు.బుధవారం వనపర్తి నియోజకవర్గం వనపర్తి మున్సిపాలిటీ పరిధిలోని 1,2,వార్డులలో బీఅర్ఎస్ అభ్యర్తి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రచారం నిర్వహించారు.వార్డుల్లో తిరుగుతూ ప్రజలతో మాట్లాడుతూ మద్దతు ను కోరారు. ఈ సందర్భంగా వనపర్తి బీఆర్ఎస్ అభ్యర్థి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ తాను పదవుల్లో ఉన్న లేకున్నా నిత్యం ప్రజల మధ్యనే ఉంటూ సమస్యలను తెలుసుకుంటూ అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేశానన్నారు

. ప్రచారంలో ప్రజలు,నాయకులు, శ్రేయోభిలాషులు స్వచ్ఛందంగా పాల్గొని తమను ఆశీర్వదించేందుకు హామీ ఇస్తున్నారన్నారు. ప్రజల ఆశీస్సులతో ఎన్నికల్లో విజయం సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ లక్ష్మీనారాయణ, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పలుస రమేష్ గౌడ్,మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, బీఆర్ఎస్ నాయకులు కోటి కృష్ణ,రామస్వామి కార్యకర్తలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Next Story