- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
'రాజకీయంగా ఎదుర్కోలేక ఇలాంటి అసత్య ఆరోపణలు'

దిశ, కల్వకుర్తి : నిత్యం సమస్యలపై అలుపెరుగని పోరు, ప్రజలతో దోస్తీ చేస్తూ గ్రామాభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్న తనపై గ్రామ పంచాయతీ నిధులను దుర్వినియోగం చేశారనే ఆరోపణ చేయడం సబబు కాదని గ్రామ సర్పంచ్ పండుగ పద్మ అన్నారు. సోమవారం కల్వకుర్తి మండల పరిధిలోని పంజుగుల గ్రామ పంచాయతీ వద్ద సర్పంచ్ పదవిని అడ్డుపెట్టుకుని పెద్ద ఎత్తున అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారంటూ మాజీ జెడ్పీటీసీ అనుచరులు రభస చేశారు. ఈ విషయం పై సర్పంచ్ స్పందిస్తూ.. గ్రామ పంచాయతీ నిధులు దుర్వినియోగం చేసి అవినీతికి పాల్పడినట్టు నిరూపించాలని అన్నారు. అసత్య ఆరోపణలు చేసి ప్రజల్లో అనుమానాలు రేకెత్తించడం భావ్యం కాదని స్పష్టం చేశారు. ఎన్నికలు దగ్గర పడుతుండడంతో తనపై అసత్య ప్రచారానికి పూనుకున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రతి కార్యక్రమాన్ని గ్రామ పంచాయతీలో అమలు పరుస్తూ నిదులను సద్వినియోగం చేసుకుని, అభివృద్ధికి బాటలు వేస్తున్నామని తెలిపారు. పాలకవర్గం సమావేశాలు, గ్రామసభలు నిర్వహిస్తూ పంచాయతీ సభ్యులు, ప్రజల అభిప్రాయాల మేరకు అభివృద్ధి పనులు చేపడుతూ.. అధికారుల సహకారంతో పనులు పూర్తి చేస్తూ అందరి మన్ననలు పొందుతున్నామని సర్పంచ్ పండుగ పద్మ అన్నారు.
Read More....