- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలను సందర్శించిన ప్రజాప్రతినిధులు..
దిశ, జడ్చర్ల: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ప్రాజెక్టులను సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ఎంపీలు, ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులకు బీఆర్ఎస్ నాయకులకు ప్రత్యక్షంగా చూపెట్టాలని పార్టీ అధిష్టానం ఆదేశించింది. అందులో భాగంగా ఆదివారం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మిస్తున్న ప్రాజెక్ట్ డ్యాంలను వికారాబాద్ ఎంపీ రంజిత్ రెడ్డి, వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ ఆధ్వర్యంలో వికారాబాద్ నియోజకవర్గ జడ్పీటీసీలు ఎంపీటీసీలు, ఎంపీపీలు ముఖ్య నాయకులు సుమారు 500 మందితో కలిసి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం డ్యాం సందర్శనకు వచ్చారు.
ముందుగా వట్టెం రిజర్వాయర్ పనులను పరిశీలించి నాగర్ కర్నూల్ మండలంలోని కుమ్మెర వద్ద నిర్మించిన టన్నెళ్లను పరిశీలించారు. అనంతరం కర్వేనా రిజర్వాయర్ ని పరిశీలించారు. అనంతరం సాయంత్రం జడ్చర్ల మండలంలోని వల్లూరు ఉదండాపూర్ గ్రామం వద్ద నిర్మిస్తున్న పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం డ్యాంను ఎంపీ, ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గ ప్రజా ప్రతినిధులతో కలిసి వీక్షించారు. ఈ సందర్భంగా ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ ప్రాజెక్టు నిర్మాణ పనులు చూసి హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, ఏర్పడక ముందు ఉన్న దుస్థితిని ప్రజలకు అర్థమయ్యేలా వివరించేందుకు ఒక ఉదాహరణగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మిస్తున్న ఈ డ్యామ్లను చూయిస్తే వారికి గత ప్రభుత్వాలకు ప్రస్తుత ప్రభుత్వానికి ఉన్న వ్యత్యాసం తెలుస్తుందన్నారు.
తమ నియోజకవర్గంలోని బీఆర్ఎస్ పార్టీ జడ్పీటీసీలు, ఎంపీపీలు, మండల అధ్యక్షులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలకు, నాయకులకు ప్రజాప్రతినిధులకు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు చూపించేందుకు ఈ పర్యటన చేపట్టామని ఎంపీ, ఎమ్మెల్యేలు తెలిపారు. ఈ పర్యటన చేయడంతో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు చూశాక తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పట్ల తమకు మరింత గౌరవం పెరిగిందని బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న ప్రతిపక్షాలు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పరిశీలిస్తే బీఆర్ఎస్ ప్రభుత్వానికి రాష్ట్ర రైతాంగం పట్ల ఉన్న చిత్తశుద్ధి తెలుస్తోందని అన్నారు.