రబీ పంటల సాగుకు నీటి విడుదల

by Naveena |
రబీ పంటల సాగుకు నీటి విడుదల
X

దిశ, అచ్చంపేట రూరల్: నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం చంద్రసాగర్ రిజర్వాయర్ నుంచి రబీ సీజన్ పంటకు అవసరమయ్యే సాగునీటిని ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ విడుదల చేశారు. చంద్రసాగర్ కాలువలకు కొన్ని చోట్ల మరమ్మతులు చేయాల్సిన అవసరం ఉందని, సంబంధించిన ప్రతిపాదనలు ఇరిగేషన్ శాఖ అధికారులు సిద్ధం చేశారు. త్వరలో ఇరిగేషన్ శాఖ మంత్రితో మాట్లాడి నిధులు కేటాయించి కాల్వలను కూడా మరమ్మత్తు చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే తెలిపారు. శ్రీశైలం ప్రాంతానికి దగ్గరగా ఉన్నటువంటి ఈ చంద్ర సాగర్ ను పర్యాటక ప్రాంతంగా మార్చాడానికి కృషి చేస్తున్నామని,అదేవిధంగా చంద్ర సాగర్ లో గత కొన్ని రోజుల క్రితం చేప పిల్లలను విడుదల చేయడం జరిగిందని తెలిపారు. దీంతో మత్స్యకారుల సొసైటీలు లబ్ధి పొందే అవకాశం ఉంటుందని అన్నారు. త్వరలోనే అచ్చంపేట నియోజకవర్గానికి సాగునీటి ప్రాజెక్టులు శంకుస్థాపనలు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బాలస్వామి,ఏఈ రమేష్, ఇరిగేషన్ శాఖ అధికారులు,ప్రజాప్రతినిధులు,విజయ డైరీ చైర్మన్ నర్సయ్యా యాదవ్, మాజీ ఎంపీపీ రామనాథం , మంత్రియనాయక్, కాశన్న యాదవ్,స్థానిక నాయకులు కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

Advertisement

Next Story