నకిలీ విత్తనాలను విక్రయిస్తే పీడీ యాక్ట్ నమోదు: ఎస్పీ రక్షితా కే మూర్తి

by Kalyani |
నకిలీ విత్తనాలను విక్రయిస్తే పీడీ యాక్ట్ నమోదు: ఎస్పీ రక్షితా కే మూర్తి
X

దిశ, వనపర్తి : రైతులకు నకిలీ విత్తనాలను విక్రయించే వారిపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని వనపర్తి జిల్లా ఎస్పీ రక్షితా కే మూర్తి హెచ్చరించారు. రైతులు నకిలీ విత్తనాల బారినపడి నష్టపోకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని పోలీసులను, అధికారులను ఎస్పీ అప్రమత్తం చేశారు. రైతులకు నకిలీ విత్తనాలను విక్రయిస్తున్న సమాచారం అందిన వెంటనే స్పందించేందుకు సిద్ధమవ్వాలన్నారు.

వ్యాపారస్థులు, సంస్థలు, వ్యక్తులు నకిలీ విత్తనాలను విక్రయిస్తున్న సమాచారం స్థానిక పోలీసులకు లేదా డయల్ 100 కు సమాచారం అందించాలని సూచించారు. సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచడంతో పాటు, వ్యక్తులకు పారితోషకాలను అందిస్తామన్నారు. నకిలీ విత్తనాలను విక్రయించిన వారిపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని హెచ్చరించారు. రైతులు విత్తనాలు, ఎరువులు కొనేముందు తప్పకుండా రసీదు తీసుకోవాలని పంట పండేంతవరకు రసీదులను జాగ్రత్తగా ఉంచుకోవాలన్నారు.

Advertisement

Next Story

Most Viewed