మొక్కజొన్నకు కనీస మద్దతు ధర కల్పించండి..

by Kalyani |
మొక్కజొన్నకు కనీస మద్దతు ధర కల్పించండి..
X

దిశ, ఉండవల్లి: రైతులకు నష్టం కలుగకుండా మొక్కజొన్నను కనీస మద్దతు ధరకు కొనగోలు చేయాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు జీకే ఈదన్న ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ శనివారం ఉండవెల్లి మండల కేంద్రంలో రైతులతో కలిసి పంటను సందర్శించి అనంతరం రైతులతో కలిసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గద్వాల జిల్లా వ్యాప్తంగా రైతులు అధిక సంఖ్యలో మొక్కజొన్న పంటను సాగు చేయడం జరిగిందన్నారు.

బహిరంగ మార్కెట్ లో సరైన ధరకు మొక్కజొన్న కొనుగోలు చేయకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. సంబంధిత అధికారులు స్పందించి తక్షణమే జిల్లా వ్యాప్తంగా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతులు సుధాకర్, గోవింద్, అజిత్ రెడ్డి, వెంకటేశ్వర్లు, బీచ్ పల్లి సుధాకర్, మహేష్, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed