నల్లమట్టి కొల్లగొట్టినట్లు నిరూపిస్తే రాజకీయ సన్యాసం : నాగంపై ఎమ్మెల్యే జనార్దన్ రెడ్డి ఫైర్​

by Sridhar Babu |   ( Updated:2023-01-21 15:01:29.0  )
నల్లమట్టి కొల్లగొట్టినట్లు నిరూపిస్తే రాజకీయ సన్యాసం : నాగంపై ఎమ్మెల్యే జనార్దన్ రెడ్డి ఫైర్​
X

దిశ, నాగర్ కర్నూల్ : అక్రమంగా చెరువులు, కుంటల్లో నల్లమట్టి కొల్లగొట్టినట్లు ఆరోపిస్తున్న నేపథ్యంలో వాటిని నిరూపిస్తే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయకుండా నాగం జనార్దన్ రెడ్డికి ఎన్నికల్లో సపోర్ట్ చేసి రాజకీయ సన్యాసం తీసుకుంటానని నాగం జనార్దన్ రెడ్డిపై స్థానిక ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. శనివారం జిల్లా కేంద్రంలోని ప్రైవేటు ఫంక్షన్ హాల్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వంలో లోటుపాట్లు ఉంటే ఉద్యమాలు చేయాలి కానీ వ్యక్తిగత దూషణలు చేస్తూ రౌడీ అంటూ సంబోధిస్తే తన 60 లక్షల సైన్యంతో ఊర్లో తిరగనివ్వనన్నారు. మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి నిత్యం కోర్టుల చుట్టూ తిరిగి పబ్బం గడిపే వ్యక్తి అని, ఇప్పటికే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనులను ఆపడం కోసం కోర్టు మెట్లు ఎక్కారని ఆరోపించారు. అదే పనిగా ప్రస్తుతం తనను ఓడించడానికి బిజినపల్లి మండలంలోని ఆరు లక్షల ఎకరాలకు సాగునీరు అందించే మార్కండేయ ప్రాజెక్టును నిలుపుదల చేసేందుకే కుట్ర పన్నుతున్నాడని పేర్కొన్నారు. అందులో భాగంగానే ప్రజలు భయపడి నాగంను అడ్డుకున్నారని చెప్పారు. అదే సందర్భంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలకు మధ్య తొక్కిసలాట జరిగింది వాస్తవమేనని, కానీ కుల రాజకీయం కోసం పీక మీద కాలు పెట్టినట్లు ఫొటోలు చిత్రీకరించడం క్షమించరానిదన్నారు. నిత్యం రాష్ట్ర ప్రభుత్వంపై అవినీతి అక్రమాలు అంటూ తన ఉనికి కోసం తిట్టిపోస్తున్నాడని, అదేపనిగా రౌడీ అంటూ తనను వ్యక్తిగత దూషణ చేయడం మంచి పద్ధతి కాదని హితవు పలికారు. మా సైన్యం 60 లక్షలు ఉన్నారని, తాము తలుచుకుంటే ఊర్లో ఒక్కరు కూడా తిరగలేరని సీరియస్​గా వార్నింగ్ ఇచ్చారు.

ప్రస్తుతం ఈయన మొరిగింది చాలక ఢిల్లీ నుంచి మరికొన్ని కుక్కలను వెంటబెట్టుకొస్తున్నాడని ఎద్దేవా చేశారు. అసలు మార్కండేయ లిఫ్ట్ అంటే తెలుసా, అక్కడికి ఏం పీకడానికి వెళ్లవ్ అంటూ ఘాటుగా స్పందించారు. నాగం అడుగుపెట్టిన చోట ఆ ప్రాంతమంతా భస్మం అయిపోతుందని ఆరోపించారు. నాగం హయాంలో ఆయన వేసే అక్రమ కేసులకు భయపడి ఎంతోమంది కాంగ్రెస్ కార్యకర్తలు భూముల అమ్ముకొని పారిపోయారని గుర్తు చేశారు. కానీ తాను 8 ఏళ్ల కాలంలో ఏ ఒక్కరిపై కేసులు పెట్టిన దాఖలాలు లేవని అలాంటిది ఒక్కటి నిరూపించినా రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. ఇద్దరం కలిసి చలో రూ.10 కోట్లు అభివృద్ధి కోసం ఖర్చు పెడదామని, దమ్ము ఉంటే ఈ సవాల్ స్వీకరించాలని సూచించారు. తాను రాజకీయాల్లోకి రాకముందే ఉమ్మడి పాలమూరు జిల్లాలో అధిక ఇన్కమ్ టాక్స్ కట్టిన వ్యక్తినని, కానీ నీవు డాక్టర్ జీవితం నుండి వచ్చినొడివి కదా మరి ఇన్ని కోట్ల ఆస్తిపాస్తులు ఎలా వచ్చాయో చెప్పాలని డిమాండ్​ చేశారు. తన మీద పోటీ చేసి గెలిస్తే తల నీలాలు ఇచ్చి రాజకీయ సన్యాసం తీసుకుంటా అంటూ సవాల్ విసిరారు. తాను మరో 10 ఏళ్ల క్రితమే రాజకీయాలకు వచ్చుంటే నాగర్​ కర్నూల్ మరింత అభివృద్ధి చెందేదన్నారు.

Advertisement

Next Story

Most Viewed