- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సీసీ కెమెరా ఆధారంగా కేసు ఛేదించిన పోలీసులు
దిశ,వనపర్తి : సీసీ కెమెరా ఆధారంగా రెండు రోజుల్లో దొంగతనం కేసును ఛేదించామని వనపర్తి సీఐ నాగభూషణం రావు తెలిపారు. శనివారం వనపర్తి పట్టణ కేంద్రంలోని కార్యాలయంలో జిల్లా ఎస్పీ రావుల రవీంధర్ ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఐ నాగభూషణం వివరాలు వెల్లడించారు. వనపర్తి జిల్లా రేవల్లి మండలం కొంకన్ పల్లి గ్రామంలో సెప్టెంబర్ 10న బోయ వెంకటేష్ ఇంట్లో రూ.30 వేల రూపాయలు దొంగలించబడ్డాయాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి రేవల్లి ఎస్సై రాము విచారణ చేపట్టారు. అందులో భాగంగా గత వారం వ్యవధిలో కొంకన్ పల్లి గ్రామంలోని సీసీ కెమెరాలను పరిశీలించగా,కుడికిల్లా మల్లేష్(30)తండ్రి రాములు ప్రవర్తనపై అనుమానం వచ్చింది.
శనివారం కొంకన్ పల్లి బస్సు స్టాండ్ సమీపంలో కుడికిల్లా మల్లేష్ ను అదుపులోకి తీసుకొని విచారించగా నేరాన్ని అంగీకరించాడు. కేసు నమోదు చేసి రిమాండ్ కి తరలించామని తెలిపారు. సదరు నేరస్తుడు సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ ప్రాంతాల్లో కూడా తాళాలు వేసిన ఇండ్లులో దొంగతనాలకు సంబంధించిన కేసులు ఉన్నాయని తెలిపారు. నేరలను అరికట్టెందుకు ప్రజలు ప్రతి కాలనీ,వార్డులలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.కేసు ఛేదించడంలో చురుకుగా విధులు నిర్వహించిన పోలీసులు కానిస్టేబుల్ రామకృష్ణ, బలరాం, అంజిలను సీఐ అభినందించారు.