Collector Vijayendira : కుక్కలకు కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు నిర్వహించండి..

by Sumithra |
Collector Vijayendira : కుక్కలకు కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు నిర్వహించండి..
X

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్ : పట్టణంలోని వీధి కుక్కలకు కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు నిర్వహించి నియంత్రించాలని జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి, మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డిని ఆదేశించారు. బుధవారం పట్టణ శివారులోని మౌలాలీ గుట్టపై ఉన్న జంతు జనన కుటుంబ నియంత్రణ కేంద్రాన్ని ఆమె సందర్శించారు. ప్రతి రోజూ ఎన్ని కుక్కలకు శస్త్ర చికిత్సలు నిర్వహిస్తున్నారని అధికారులను ప్రశ్నించగా, ప్రతి రోజు 10 కుక్కలకు కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు నిర్వహిస్తున్నట్లు తెలుపగా, రోజుకు 50 కుక్కలకు కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు నిర్వహించాలని ఆమె ఆదేశించారు.

అంతేకాక ఈ కేంద్రాన్ని విస్తరించి, జడ్చర్ల, భూత్పూర్ మున్సిపాలిటీల్లోని శునకాలకు కూడా శస్త్ర చికిత్సలు నిర్వహించాలని ఆమె ఆదేశించారు. అనంతరం ఆమె గతంలో వరద నీటి ద్వారా ముంపునకు గురయ్యే రామయ్యబౌలి ప్రాంతాన్ని సందర్శించి వరద సమస్యను అడిగి తెలుసుకున్నారు. మర్లు ప్రాంతంలోని వరద నీటిని కాల్వకు డైవర్ట్ చేస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి తెలిపారు. డ్రైయిన్ అంచున ఉన్న సక్సెస్ స్కూల్ ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉందని స్కూల్ యాజమాన్యాన్ని అప్రమత్తం చేయాలని ఆమె మున్సిపల్ కమిషనర్ ను ఆదేశించారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, పశుసంవర్థక శాఖ జెడి మధుసూదన్, ఏడీ వెంకటేశ్వర్లు తదితర అధికారులు ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed