- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
MLA G. Madhusudan Reddy : మరోసారి బడ్జెట్ లో తెలంగాణకు మొండి చేయి చూపిన కేంద్రం..
దిశ, దేవరకద్ర : కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో తమ మిత్రపక్షాలకు చెందిన రాష్ట్రాలకు మాత్రమే కేటాయింపులు చేసి, తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో మొండి చేయి చూపిందని దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ కేవలం మోడీ కుర్చీ కాపాడుకునేందుకు కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ ప్రవేశపెట్టినట్లు ఉందని ఎమ్మెల్యే జీయంఆర్ అన్నారు. పక్కన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అమరావతికి 16,000/- వేలకోట్లు కేటాయించి, తెలంగాణ ప్రజలకు వరప్రదాయిని పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టుకు బడ్జెట్ లో నిధులు కేటాయించకుండా మొండి చేయి చూపి, తెలంగాణ ప్రజల ఆశలపై కేంద్ర ప్రభుత్వం నీళ్లు చల్లిందని అన్నారు.
బడ్జెట్లో ప్రాపర్టీ టాక్స్ 12.5 శాతం పెంచడం వల్ల సామాన్యుల పై తీవ్ర భారం మోపిందని, రేపు ఆర్థిక ఇబ్బందుల కారణంగా సామాన్యులు తమ కున్న ఫ్లాట్ లేదా ఇంటిని అమ్ముకున్న 12.5% ప్రభుత్వానికి టాక్స్ కట్టడానికి బడ్జెట్ లో ప్రతిపాదించడం సిగ్గుచేటని కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ పై జీఎంఆర్ మండిపడ్డారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా సామాన్యులు తమ ఇంటిని లేదా ఫ్లాట్ ను అమ్ముకుంటే 12.5 శాతం ప్రాపర్టీ టాక్స్ కట్టమనడం శోచనీయమని అన్నారు.