- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Nargarjuna Sagar: నేడు ‘సాగర్’ గేట్లు ఓపెన్.. ఉదయం 8 గంటలకు ముహూర్తం ఫిక్స్
దిశ, నాగార్జున సాగర్: ఉరకలెత్తుతూ ప్రవహిస్తున్న కృష్ణమ్మ నాగార్జునసాగర్ జలాశయానికి వడివడిగా చేరుతోంది. వరద ప్రవాహం అంతకంతకూ పెరుగుతుండటంతో సాగర్ నిండు కుండలా మారింది. జలాశయంలో నిల్వలు గరిష్ఠ స్థాయికి చేరువ కావడంతో ఇవాళ గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఉదయం 10 గంటలకు 6 గేట్లను ఎత్తి సుమారు 2 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేయనున్నట్లు సీఈ నాగేశ్వరరావు తెలిపారు. శ్రీశైలానికి ఎగువ నుంచి 4,00,491 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండటంతో.. పూర్తి సామర్థ్యం 215.60 టీఎంసీలకు.. నిల్వ 203.89 టీఎంసీలకు చేరింది. దీంతో 10 గేట్లను ఎత్తి కుడి, ఎడమ జల విద్యుత్తు కేంద్రాల్లో విద్యుదుత్పత్తి చేస్తూ సాగర్‌కు 4,27,711 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590అడుగుల (312.50 టీఎంసీలు)కు 58.40 అడుగులు(284.1688టీఎంసీలు)గా నమోదైంది. సాగర్ నుంచి కుడి కాల్వ ద్వారా 5,700 క్యూసెక్కులు, ఎడమ కాల్వ ద్వారా 4,613క్యూసెక్కులు, విద్యుదుత్పత్తి ద్వారా 26,040 క్యూసెక్కులు, ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 1,200 క్యూసెక్కులు.. మొత్తం 37,873 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదలవుతోంది.
జెన్ కో.. జర దేఖో
నాగార్జునసాగర్ నుంచి సోమవారం నీటిని విడుదల చేయనున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. అయితే ప్రధాన జలవిద్యుత్తు కేంద్రంలో 8 టర్బైన్లు ఉండగా.. 2, 4వ నంబరు టర్బైన్లు మరమ్మతులకు గురై 6 నెలలు అవుతున్నా జెన్‌కో అధికారులు మరమ్మతులు పూర్తి చేయలేదు. ఎగువ నుంచి భారీగా వరద వస్తున్నప్పటికీ జెన్‌కో అధికారుల నిర్లక్ష్యంతో పూర్తి స్థాయిలో విద్యుదుత్పత్తికి అవకాశం లేకుండా పోయిందని నీటి పారుదల, విద్యుత్తు రంగ నిపుణులు మండిపడుతున్నారు. దీనిపై జెన్‌కో ఎస్‌ఈ రఘురాం మాట్లాడుతూ.. 1వ టర్బైన్ మినహా మిగిలిన 7 టర్బైన్‌లు జపాన్ నుంచి తెచ్చి ఏర్పాటు చేసినవని.. మరమ్మతులకు జపాన్ నుంచే నిపుణులు రావాల్సి ఉందని చెప్పారు.