వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే బీరం..

by Kalyani |
వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే బీరం..
X

దిశ, కొల్లాపూర్: పెద్దకొత్తపల్లి మండలం పరిధి దేవుని తిరుమలాపురంలో బుధవారం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు. ధాన్యం కేంద్రాలలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. అనంతరం రాత్రి కురిసిన అకాల వర్షానికి తడిసిన వరి ధాన్యాన్ని పరిశీలించి రైతులకు అధైర్య పడవద్దని ప్రభుత్వం అండగా ఉంటుందని, అలాగే పంట నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటామని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, పెద్ద కొత్తపల్లి బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed