ఆర్ఓబీ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే ఆల, కలెక్టర్ రవి నాయక్..

by Kalyani |
ఆర్ఓబీ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే ఆల, కలెక్టర్ రవి నాయక్..
X

దిశ, దేవరకద్ర: మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండల కేంద్రంలో నిర్మిస్తున్న ఆర్ఓబీ పనులను గురువారం ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ రవి నాయక్ ప్రజా ప్రతినిధులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్ఓబీ పనులను త్వరగా పూర్తి చేయాలని సంబంధిత కాంట్రాక్టర్, అధికారులను ఆదేశించారు. అనంతరం మండల కేంద్రంలో రంజాన్ పండుగ సందర్భంగా మైనార్టీ సోదరులకు ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి రంజాన్ తోఫా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో దేవరకద్ర ఎంపీపీ రమ శ్రీకాంత్ యాదవ్, జడ్పీటీసీ అన్నపూర్ణ శ్రీకాంత్, తహసీల్దార్ జ్యోతి, ఎంపీడీవో శ్రీనివాసులు, పీఏసీఎస్ చైర్మన్ నరేందర్ రెడ్డి, పార్టీ అధ్యక్షుడు జెట్టి నరసింహారెడ్డి, కర్ణంరాజు, శ్రీకాంత్ యాదవ్, కొండ శ్రీనివాస్ రెడ్డి, కొండ భాస్కర్ రెడ్డి, డొబ్బలి అంజి తదితరులు పాల్గొ్న్నారు.

Advertisement

Next Story