మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే అబ్రహం..

by Kalyani |
మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే  అబ్రహం..
X

దిశా, వడ్డేపల్లి: జోగులాంబ గద్వాల జిల్లా అల్లంపూర్ నియోజకవర్గం లోని వడ్డేపల్లి ప్రాథమిక వ్యవసాయ శాఖ కేంద్రం శాంతినగర్ లో మంగళవారం మార్క్ పెడ్ వారి ఆధ్వర్యంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని అల్లంపూర్ ఎమ్మెల్యే అబ్రహం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు దళారుల చేతిలో తక్కువ ధరకు అమ్ముకొని నష్టపోతారనే ఉద్దేశంతో రైతుల పక్షపాతి సీఎం కేసీఆర్ మద్దతు ధర నిర్ణయించి మార్క్ ఫెడ్ ద్వారా మొక్కజొన్నలు కొనుగోలు చేయాలని సంకల్పించారని అన్నారు.

రైతులు నిర్దేశించిన పద్ధతి ప్రకారం తేమ శాతం ఉండేలా చూసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఎస్ మాజీ చైర్మన్ సీతారామరెడ్డి, వడ్డేపల్లి మండలం ఎంపీపీ రజిత, వడ్డేపల్లి జడ్పీటీసీ రాజు, మున్సిపల్ చైర్మన్ కరుణా సూరి, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు వెంకటేశ్వర రెడ్డి, కౌన్సిలర్లు రవి, డీలర్ శ్రీను, తోట రవి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story