- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఇంజనీరింగ్ విద్యార్థిని అదృశ్యం..
దిశ, నవాబుపేట : మహబూబ్ నగర్ పట్టణంలోని జేపీఎన్సీ ఈ కళాశాలలో బీటెక్ రెండవ సంవత్సరం చదువుతున్న నవాబుపేట మండల కేంద్రానికి చెందిన మంత వర్షిత (20 ) అనే విద్యార్థిని ఈ నెల 22వ తేదీ నుంచి కనిపించకుండా పోయింది. ప్రతిరోజు తన సొంత గ్రామమైన నవాబుపేట నుండి మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో గల జెపీఎన్సీ ఈ కళాశాలకు వెళ్లి విద్యాభ్యాసం చేసి వచ్చే వర్షిత 22వ తేదీ కూడా యధావిధిగా కళాశాలకు వెళుతున్నానని ఇంట్లో వాళ్లకు చెప్పి వెళ్లి ఆ రోజు సాయంత్రం ఇంటికి తిరిగి రాలేదు. విద్యార్థిని ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆందోళన గురైన ఆమె తల్లిదండ్రులు కళాశాలకు ఫోన్ చేసి విచారిస్తే ఆమె ఆరోజు కళాశాలకు రాలేదని తెలిపారు.
ఆనాటి నుండి ఆమె కొరకు తమ బంధుమిత్రుల ఇళ్లల్లో, తెలిసిన వారి ఇళ్లల్లో ఎంతగానో వెతికినా కూడా ఆమె ఆచూకీ లభించకపోవడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. కనిపించకుండా పోయిన విద్యార్థిని తల్లి మంత శివలీల తన కూతురు అదృశ్యం గురించి బుధవారం స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన కూతురు అదృశ్యానికి మండల పరిధిలోని వీర్ శెట్టి పల్లి గ్రామానికి చెందిన వడ్డే అరవింద్ కారణమై ఉంటాడని ఆమె తన ఫిర్యాదులో అనుమానం వ్యక్తం చేసింది. విద్యార్థిని తల్లి శివలీల ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై విక్రం తెలిపారు.