- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కొల్లాపూర్ సమగ్ర అభివృద్ధికి మంత్రి జూపల్లి కృషి
దిశ, కొల్లాపూర్: కొల్లాపూర్ గొప్పతనం భారతదేశం నలుమూలల వ్యాప్తి చెందుతుందని నాగర్ కర్నూల్ ఎంపీ డాక్టర్ రవి స్పష్టం చేశారు. కొల్లాపూర్ ఆర్ఐడి స్కూల్, కళాశాల స్వర్ణోత్సవాలకు మల్లు రవి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా మల్లు రవి మాట్లాడుతూ..నాడు సురభి రాజుల కాలంలో కొల్లాపూర్ పట్టణంలో పాఠశాలలే కాకుండా మంచినీళ్లు, విశాలమైన రోడ్ల సౌకర్యం కల్పించిన సురభి రాజుల సేవలను స్మరించారు. కొల్లాపూర్ ప్రజల వ్యవహార శైలిలో,చదువులోను ముందుంటారని ఆయన పేర్కొన్నారు. నాగర్ కర్నూల్ పార్లమెంటు పరిధిలో కొల్లాపూర్ నియోజక వర్గం ఉండడం, ఇక్కడి నుంచి మంత్రి జూపల్లి కృష్ణారావు, మై హోమ్ గ్రూప్స్ చైర్మన్ జూపల్లి రామేశ్వర్ రావు తన పట్ల చూపిన ఆదరాభిమానాలను మరువబోమని మల్లు రవి స్పష్టం చేశారు. 1991లో తాను ఎంపీగా ఎన్నికైన నాటి నుంచి చూపెల్లి రామేశ్వరావుతో తనకున్న అనుబంధాన్ని రవి వివరించారు. జై శ్రీమన్నారాయణ మంత్రం పట్టిస్తూ రామేశ్వరావు ప్రజలకు మార్గదర్శకుడయ్యారన్నారు. ముచ్చింతలలో సమతా స్ఫూర్తితో రామానందుడి విగ్రహా అవిష్కరణకు ప్రధానమంత్రి తో పాటు..కేంద్ర,రాష్ట్ర మంత్రులను ఆహ్వానించిన గొప్ప వ్యక్తి జూపల్లి రామేశ్వరావు అని మల్లు రవి తెలిపారు.
ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేయాలని ఆయన రామేశ్వరావుకు సూచించారు. కొల్లాపూర్ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి మంత్రి జూపల్లి కృష్ణారావు కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. నాగర్ కర్నూల్ పార్లమెంట్ పరిధిలో ఉన్న ఏడు నియోజకవర్గాలలో కొల్లాపూర్ నియోజక వర్గం నుంచి పార్లమెంట్ ఎన్నికల్లో తనకు 45 వేల ఓట్ల మెజార్టీ తో తనను గెలిపించిన విషయాన్ని మల్లు రవి గుర్తు చేశారు. స్థానిక సురభిరాజా బాలాదిత్య లక్ష్మారావు మాట్లాడుతూ..మన ఊరు మన జనం అయినందుకు ఈ ఉత్సవాలకు రావడం జరిగిందని, ఇందుకు మీ అందరికీ ధన్యవాదాలని తెలిపారు. అనంతరం స్వర్ణోత్సవాల వేదికపై పూర్వ విద్యార్థులైన మంత్రి జూపల్లి కృష్ణారావు, మై హోమ్ గ్రూప్స్ అధినేత జూపల్లి రామేశ్వరరావు, ఢిల్లీ బిట్స్ వైస్ ఛాన్స్లర్ డాక్టర్ రాం గోపాల్ రావు, యూఎస్ఏ లో ప్రొఫెసర్ జయరాం రెడ్డి ల బాల్య స్మృతులు, విజయగాథల పై చర్చ గోష్ఠి జరిగింది. అనంతరం స్వగ్రామం కుడికిళ్లలో మై హోమ్ గ్రూప్స్ అధినేత జూపల్లి రామేశ్వరరావు ఎంపీ మల్లురవిని శాలువా కప్పి పుష్పగుచ్చం అందజేసి సన్మానించారు. ఇవాళ సాయంత్రం ముగింపు కార్యక్రమం పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమీపంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ రానున్నారు. ఎంపీ డాక్టర్ రవి వెంట టీపీసీసీ సభ్యుడు చింతలపల్లి జగదీశ్వరరావు, సైంటిస్ట్ మరాఠీ బలరాం,ఇతర నాయకులు పాల్గొన్నారు.