- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వైద్యానికే మొదటి ప్రాధాన్యత: ఎమ్మెల్యే అబ్రహం
దిశ, అలంపూర్ టౌన్: ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో వైద్యానికి మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారని ఎమ్మెల్యే అబ్రహం తెలిపారు. గురువారం అలంపూర్ పురపాలకలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. ముందుగా రూ. 57 లక్షలతో నిర్మించిన సబ్ ట్రెజరీ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ చేశారు. అలంపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో రూ. 60 లక్షలతో ఏర్పాటు చేసిన డయాలసిస్ కేంద్రాన్ని ప్రారంభించారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్ర సరిహద్దులో ఉన్న అలంపూర్ నియోజకవర్గం వైద్య పరంగా ఇబ్బంది ఎదుర్కోడాన్ని కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లడంతో అలంపూర్ పట్టణంలో డయాలసిస్ కేంద్రానికి అనుమతించి నిధులు మంజూరు చేసి పూర్తి చేసినందుకు కేసీఆర్, హరీష్ రావులకు కృతజ్ఞతలు తెలిపారు. డయాలసిస్ కోసం కర్నూలు, గద్వాల్ కు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇక్కడే చేయించుకోవచ్చని చెప్పారు. ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్న ప్రతిపక్షాలు విమర్శించడం తగదని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ మనోరమ, ఇంచార్జి డీఎంహెచ్ఓ సిద్ధప్ప, హాస్పిటల్ సూపరిటెండెంట్ పరశురాం, బీఆర్ఎస్ కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.