- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఆరు నెలల్లో మార్కండేయ లిఫ్ట్ పూర్తి.. లేని పక్షంలో నాగం తరుపున ప్రచారం చేస్తా: ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి

దిశ, బిజినేపల్లి: ఆరు నెలల్లో మార్కండేయ లిఫ్టు పూర్తి చేస్తానని, లేని పక్షంలో తానే నాగం జనార్దన్ రెడ్డి తరుపున ప్రచారం చేస్తానని నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అన్నారు. బిజినేపల్లి మండల పరిధి శాయినిపల్లిలోని మార్కండేయ పైలాన్ శిలా పలకను కాంగ్రెస్ నాయకులు అపరిశుభ్రం చేశారని, దానికి నిరసనగా సోమవారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కృష్ణమ్మ జలాలతో 101 బిందెల నీటితో శుద్ధి చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా తిమ్మాజిపేట్ నుంచి బైకు ర్యాలీతో శాయినపల్లిలోని మార్కండేయ పైలాన్ వరకు బీఆర్ఎస్ నాయకులు బైకు ర్యాలీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ.. ఒకవేళ మార్కండేయ లిఫ్టును పూర్తిచేస్తే నాగం జనార్దన్ రెడ్డి పోటీ చేయకుండా తనకు ప్రచారం చేయాలని ఎమ్మెల్యే అన్నారు. సవాల్ కు ప్రతి సవాల్ కట్టుబడి ఉండాలని లేకుంటే ఏదైనా పని చేసుకోవాలని సూచించారు. నిన్నటి సభలో దళిత గిరిజన సభ అని ఉమ్మడి జిల్లా మొత్తం పిలిపించుకొని అంబేద్కర్ కు దండ వేయకుండా అవమానపరిచి సభకు దళిత గిరిజన ఆత్మ గౌరవ సభ అని చెప్పడం తనకే తగునని ఎద్దేవా చేశారు.
దళిత గిరిజనుల ఆత్మగౌరవ సభ అంటే వారికి ఏదో భరోసా ఇస్తారేమో అని అనుకున్నాం కానీ, వారిని ఇంత అవమాన పరుస్తారని అనుకోలేదని అన్నారు. ఐదు కోట్లతో దళిత గిరిజన ఆత్మగౌరవ సభను నిర్వహించడం ఎవరికోసమని ప్రశ్నించారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పొద్దున్నే వస్తే కాలువల్లో నీళ్లు చూపించి ఈ ప్రాంతం వారు తగిన బుద్ధి చెప్తారని రాత్రి అయిన తర్వాత సభకు వచ్చారని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ డీసీసీబీ డైరెక్టర్ జక్క రఘునందన్ రెడ్డి, మార్కెట్ చైర్మన్ కురుమయ్య, పీఏసీఎస్ చైర్మన్ బాలరాజ్ గౌడ్, ఎంపీపీ శ్రీనివాస్ గౌడ్, వైస్ ఎంపీపీ చిన్నారెడ్డి, సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు శేఖర్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు శేఖర్ రావు, రాములు నాయక్ తదితరులు పాల్గొన్నారు.