పిడుగుపాటుకు గురై వ్యక్తి మృతి..

by Kalyani |
పిడుగుపాటుకు గురై వ్యక్తి మృతి..
X

దిశ, గద్వాల/గట్టు: పిడుగుపాటుకు గురై వ్యక్తి మృతి చెందిన సంఘటన జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండల పరిధిలోని సల్కాపురం గ్రామంలో జరిగింది. గట్టు ఎస్ఐ పవన్ కుమార్ కథనం ప్రకారం.. సల్కాపురం గ్రామానికి చెందిన బోయ హనుమంతు (45), శుక్రవారం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో వర్షం వచ్చే సూచన కనిపించడంతో హనుమంతు పొలంలో ఉన్న వరి ధాన్యంపై కవర్లు కప్పడానికి అతని కొడుకు తిమ్మప్పతో కలిసి బయలుదేరాడు. కాగా వరి ధాన్యంపై కవర్లు కప్పుతున్న క్రమంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షంతో పాటు పిడుగుపడింది. దీంతో హనుమంతు మృతి చెందాడు. హనుమంతు భార్య ఈరమ్మ ఫిర్యాదు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed