- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
రాష్ట్రంలో విద్యకు మహర్దశ

దిశ ప్రతినిధి,మహబూబ్ నగర్: రాష్ట్రంలో విద్యకు మహర్దశ ప్రారంభమైందని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శనివారం జిల్లా కేంద్ర సమీపంలోని కోడూరు గ్రామంలోని కస్తుర్బా బాలికల విద్యాలయంలో ఇంటర్ విద్యార్దుల కోసం సొంత నిధులతో ఏర్పాటు చేసిన 'సైన్స్ ల్యాబ్' ను,మూడా నిధులతో ఏర్పాటు చేసిన 'ఆర్ఓ ప్లాంట్' ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక విద్యకు మొదటి ప్రాధాన్యత ఇస్తూ..అధిక నిధులను కేటాయించి,ప్రైవేటు కళాశాలలకు ధీటుగా ప్రభుత్వ విద్యా సంస్థల్లో విద్యార్థులకు అన్నిరకాల మౌలిక సదుపాయాలు కల్పిస్తూ,డైట్ చార్జీలు సైతం భారీగా పెంచామని అన్నారు. పాలమూరు యూనివర్సిటీ లో ఇంజనీరింగ్,న్యాయ కళాశాలను మంజూరు చేశారని,అలాగే మదీనా ఎడ్యుకేషనల్ సొసైటీ వారి బిఇడి కళాశాల వద్ద మైనారిటీ ఇంజనీరింగ్ కళాశాలను కూడా నూతనంగా ఏర్పాటు చేస్తున్నామని ఆయన తెలిపారు. ఉన్నతంగా చదివి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సువర్ణ,ఎంఇఓ కృష్ణయ్య,గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి,మూడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్,డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ,రామచంద్రయ్య,యాదయ్య గౌడ్,మాధవ రెడ్డి,నర్సింహారెడ్డి,గోవింద్ యాదవ్,రంగయ్య,కొండయ్య,రాజు,ఉపాద్యాయులు,విద్యార్థులు పాల్గొన్నారు.