- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మలేరియా రహిత జిల్లాగా మార్చుదాం: కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్
దిశ, వనపర్తి: 2023 వ సంవత్సరం నాటికి మలేరియా రహిత వనపర్తి జిల్లా మార్చేందుకు వైద్య, ఆరోగ్య శాఖ గ్రామీణ శాఖ, మున్సిపల్ శాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలని వనపర్తి కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి కార్యక్రమాలు కీటక జనిత వ్యాధుల నియంత్రణలో మంచి ఫలితాలను ఇస్తున్నాయన్నారు. 2022 సంవత్సరంలో మలేరియా కేసులు నమోదు కాలేదని తెలిపారు.
మంగళవారం ప్రపంచ మలేరియా నివారణ దినోత్సవం సందర్భంగా వనపర్తి జిల్లా కేంద్రంలోని వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన కిటక జనిత వ్యాధుల నివారణపై అవగాహన ర్యాలీనీ జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ జెండా ఊపి ప్రారంభించారు. అవగాహన ర్యాలీ పాలిటెక్నిక్ కళాశాల మైదానం నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జి డీఎం అండ్ హెచ్ఓ డాక్టర్ సాయినాథ్ రెడ్డి, డిప్యూటీ డీఎం అండ్ హెచ్ఓ డాక్టర్ శ్రీనివాసులు, మలేరియా నివారణ అధికారి శ్రీనివాస్ జీ, హెల్త్ ఎడ్యుకేటర్ మధు, ఆశా వర్కర్లు ఏఎన్ఎంలు, ల్యాబ్ టెక్నీషియన్లు,హెల్త్ అసిస్టెంట్ లు వైద్య ఆరోగ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.