- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
శాంతిభద్రతల పరిరక్షణకు అందరం కృషి చేద్దాం: ఎమ్మెల్యే ఆల
దిశ, భూత్పూర్: గ్రామాలలో శాంతిభద్రతల పరిరక్షణకు పార్టీలకతీతంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు. గురువారం భూత్పూర్ మండల పోలీస్ స్టేషన్ పరిధిలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి, జడ్పీ చైర్ పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి, ఎస్పీ నరసింహ, మున్సిపల్ చైర్మన్ బసవరాజ్ గౌడ్, ఎంపీపీ కదిరే శేఖర్ రెడ్డి హాజరయ్యారు. సీసీ కెమెరాల ప్రారంభం అనంతరం సీఐ రజిత అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ నేరాలను అరికట్టడంలో సీసీ కెమెరాలు ప్రధాన భూమిక పోషిస్తున్నాయని చెప్పారు.
ఇప్పటికే పలు ముఖ్య కూడళ్లలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోగలిగామని, గ్రామ పంచాయతీలలోనూ ఏర్పాటు చేసుకోవడానికి ఆయా గ్రామాల సర్పంచులు చొరవ చూపాలని కోరారు. నియోజకవర్గంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాలకు ప్రభుత్వం రూ. 29 లక్షలు మంజూరు చేసినట్లుగా ఎమ్మెల్యే వెల్లడించారు. దాతల సహకారంతో కురుమూర్తి దేవాలయం వద్ద పోలీస్ కంట్రోల్ రూంఏర్పాటు చేయగలుగుతున్నామని ఆయన వెల్లడించారు. జిల్లా ఎస్పీ నరసింహ మాట్లాడుతూ ఒక్క సీసీ కెమెరా 100మంది పోలీసులకు సమానమని అన్నారు. అవసరమున్న ప్రతిచోట సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం వల్ల నేరాలను, ప్రమాదాలను తగ్గించుకోవడానికి అవకాశం లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.