- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Land dispute : లింగంపేటలో భూ వివాదం..
దిశ, జడ్చర్ల : జడ్చర్ల మండలం లింగంపేట గ్రామంలో భూ వివాదం రాజుకుంది. గ్రామంలోని 4 ఎకరాల ప్రభుత్వ భూమిని కాంగ్రెస్ పార్టీ నాయకుడు అక్రమంగా కబ్జా చేస్తుండని ఆదివారం గ్రామస్తులందరూ ఏకమై ప్రభుత్వ భూమిలో చదును చేస్తుండడాన్ని అడ్డుకున్నారు. దీంతో గ్రామస్తులకు నాయకుడి కుటుంబం మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. జడ్చర్ల మండల పరిధిలోని లింగంపేట గ్రామంలో సర్వేనెంబర్ 863లో సీలింగ్ యాక్ట్ ప్రకారం నాలుగు ఎకరాల ఎక్సెస్ (మిగులు) భూమి ఉంది. అందులో గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్, కాంగ్రెస్ పార్టీ నాయకుడు, తన తండ్రి 1986 నుండి ఇదే భూములు వ్యవసాయం చేస్తున్నాడని, గత రెండు సంవత్సరాలుగా చేయలేదని, మళ్లీ ఇప్పుడు వ్యవసాయం చేస్తానని భూమిని చేయడానికి ఆదివారం వెళ్లారు. దీంతో గ్రామస్తులు ప్రభుత్వ మిగులు భూమిని ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా ఎలా దున్నుతారని, ప్రభుత్వ భూమి గ్రామ అవసరాలకు ఉపయోగపడాలి తప్ప ఒకరి అవసరాలకు వాడుకో రాదని గ్రామస్తులు భూమి చదును చేస్తున్నాడా అని అడ్డుకున్నారు. ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొనడంతో జడ్చర్ల పోలీసులకు 100 సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి వెళ్ళిన పోలీసులు ఇరువర్గాలను శాంతింపజేశారు.
ఏమైనా సమస్య ఉంటే చట్ట ప్రకారం రెవెన్యూ అధికారుల సమక్షంలో పరిష్కరించుకోవాలని సూచించారు. దీంతో గ్రామస్తులు అందరు ఏకమై జడ్చర్ల పోలీస్ స్టేషన్ కు తరలి వెళ్లి గ్రామంలో అక్రమంగా 4 ఎకరాల ప్రభుత్వ మిగులు భూమిని కాంగ్రెస్ పార్టీ నాయకుడు యాదయ్య కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకుడు తన తండ్రిలా కాలం నాటి నుండి 863 సర్వే నెంబర్ లో గల పొలంలో వ్యవసాయం చేస్తున్నామని, ఆ భూమి తమకే దక్కుతుందని, రాము ఆ భూమిని చదును చేయడానికి వెళ్ళగా తమ పై గ్రామస్తులు దాడి చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన పై ఇరువు వర్గాల నుంచి ఫిర్యాదులు అందాయని, కానీ రేపు సోమవారం రెవెన్యూ అధికారులు గ్రామానికి వెళ్లి గ్రామస్తులతో మాట్లాడి పూర్వఫలాలు పరిశీలించి, చట్ట ప్రకారం ముందుకు వెళ్తామని సీఐ ఆదిరెడ్డి తెలిపారు. ఈ ఘటనపై గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గ్రామస్తులకు కౌన్సిలింగ్ ఇచ్చామని సీఐ తెలిపారు.