Srisailam project : శ్రీశైలం ప్రాజెక్టుకు వస్తున్న కృష్ణ వరద జలాలు..

by Sumithra |   ( Updated:2024-07-21 09:47:14.0  )
Srisailam project : శ్రీశైలం ప్రాజెక్టుకు వస్తున్న కృష్ణ వరద జలాలు..
X

దిశ, అచ్చంపేట : ఎగువన ఉన్న కర్ణాటక రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఆల్మట్టి డ్యాం పూర్తిస్థాయిలో వినడంతో దిగువన ఉన్న జూరాల ప్రాజెక్టు కృష్ణమ్మ పరవళ్ళు తొక్కుతుంది. తద్వారా జూరాల ప్రాజెక్టు గేట్లను ఎత్తి దిగువన ఉన్న శ్రీశైలం ప్రాజెక్టుకు నీటిని వదులుతున్నారు. జూరాల ప్రాజెక్టు స్పిల్ వే ద్వారా 64.490 క్యూసెక్కులు అలాగే విద్యుత్ ఉత్పత్తి ద్వారా 31.167 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.

మొత్తం 96,107 వేల క్యూసెక్కుల నీరు విడుదల అవుతుండగా శ్రీశైలం ప్రాజెక్టుకు 87, 082 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంది. అయితే ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టు సామర్థ్యం 885 అడుగులు కాగా 215.87 టీఎంసీల సామర్థ్యం నీటి నిలువ ఉంటుంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టులో ఆదివారం మధ్యాహ్నం నాటికి 820 .00 అడుగులు చేరుకోగా 40.8170 టీఎంసీల సామర్థ్యం చేరుకుంది. గత రెండు రోజులుగా శ్రీశైలం ప్రాజెక్టుకు ఏడు టీఎంసీలకు పైగా వరద జలాలు వచ్చి చేరాయి.

Advertisement

Next Story