- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
KMR Trust : జాతీయ స్థాయి బండలాగుడు పోటీలు ప్రారంభం..
దిశ, పెంట్లవెల్లి : పెంట్లవెల్లి మండలం కొండూరు గ్రామంలో దీపావళి పండుగ సందర్భంగా జాతీయస్థాయి బండలాగుడు పోటీలు ప్రారంభం అయ్యాయి. ఈ పోటీలను లక్ష్మీ గోపాల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్నారు. ఈ బండలాగుడు పోటీలను బుధవారం చిన్నంబాయి మండలం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కేఎంఆర్ ట్రస్ట్ చైర్మన్ కొత్త కళ్యాణ్ రావు ప్రారంభించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ జాతీయ స్థాయిలో బండలాగుడు పోటీలు నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందని ఆనందాన్ని వ్యక్తం చేశారు.
బుధవారం 6 పళ్ళ విభాగం 18 జతల ఎద్దులు పాల్గొన్నాయని, గురువారం న్యూ కేటగిరి విభాగం నిర్వహిస్తామని కమిటీ సభ్యులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ, ఒంగోలు జాతి పశుపోషక కన్వీనర్ మందడి చిదంబ రెడ్డి , కాంగ్రెస్ పార్టీ చిన్నంబావి మండలం ప్రెసిడెంట్ శేఖర్ యాదవ్, కొండూరు గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు, సత్యనారాయణ రావు, ఏదుల గంగన్న, రెడ్డి రవి, కురుమయ్య, రైతులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.