సీఎంకు చిత్తశుద్ధి ఉంటే కాళేశ్వరం అవినీతి పై సీబీఐ ఎంక్వైరీ చేయించాలి

by Naresh |   ( Updated:2024-03-06 11:28:55.0  )
సీఎంకు చిత్తశుద్ధి ఉంటే కాళేశ్వరం అవినీతి పై సీబీఐ ఎంక్వైరీ చేయించాలి
X

దిశ, జడ్చర్ల: కాళేశ్వరం అవినీతి పై కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే రాష్ట్ర ముఖ్యమంత్రి సీబీఐ ఎంక్వైరీ కోరాలని రేవంత్ సర్కార్ గత ప్రభుత్వ అవినీతి అక్రమాలపై సీబీఐ విచారణ ఎందుకు కోరడం లేదని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ప్రశ్నించారు. జడ్చర్ల పట్టణంలోని కంచ లింగమ్మ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన నారి శక్తి వందన కార్యక్రమంలో భాగంగా మహిళా స్వయం సహాయక సంఘాలతో దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో జరిగిన వర్చువల్ సమావేశం కార్యక్రమంలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… దేశంలో మహిళలు ఆర్థిక స్వతంత్రం ఆత్మగౌరవంతో జీవించడమే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ లక్ష్యమన్నారు గ్రామీణ ప్రాంత మహిళల కష్టాలు చూసి ఉచితంగా ఉజ్వల గ్యాస్ కనెక్షన్ మహిళా సంఘాలకు ముద్ర లోన్స్ కింద రుణాలు మహిళా సంఘాలకు పావలా వడ్డీకే రుణాలు మోదీ సర్కార్ అందించింది అన్నారు.

ప్రధాని మోడీ పాలనలో దేశ ఆర్థిక ప్రగతి ఊహించని రీతిలో మెరుగుపడిందని అన్నారు మంచి చేస్తున్న మోదీ ప్రభుత్వాన్ని మనమే నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం స్థానిక మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి పై ప్రధానమంత్రికి తెలంగాణ బీజేపీ నేతలు తప్పుడు సమాచారం ఇచ్చారన్న ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై డీకే అరుణ స్పందించారు. కాంగ్రెస్‌కు ఓటమి భయం పట్టుకుందని అందుకే ఎలాగైనా గెలవాలని కుట్రలతో కాంగ్రెస్ ఇష్టారీతిన అసత్యపు ఆరోపణలు చేస్తోందని ప్రధాని మోదీ అధికారిక పర్యటన పై రాజకీయాలు చేయడం సరికాదన్నారు. కాళేశ్వరం అవినీతి పై కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సీబీఐ ఎంక్వైరీ కోరాలని కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి పై జ్యుడిషియల్ ఎంక్వయిరీ అనేది కాలయాపన చేయడానికి మాత్రమేనని అన్నారు. రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో కాళేశ్వరం అవినీతి పై తన వద్ద ఆధారాలు ఉన్నాయని అన్నారు. కదా ఇప్పుడు మీరే అధికారంలోకి వచ్చారు కాలయాపన చేయకుండా సీబీఐ ఎంక్వైరీ కోరి నిజానిజాలను వెలికి తీయాలని డిమాండ్ చేశారు.

ఇటీవల ప్రభుత్వం తరపు కార్యక్రమంలో ప్రధాన మంత్రితో పాటు పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ ప్రధానమంత్రిని బడేబాయి అంటూ సంబోధించడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర సహకారాన్ని కోరడంలో తప్పు లేదని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రధానమంత్రిని తిట్టకుండా ఒక మంచి సంప్రదాయాన్ని నెలకొల్పడం రాష్ట్ర అభివృద్ధికి ఎంతో అవసరం అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి చిత్తరంజన్ దాస్ బిజెపి జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు బాల త్రిపుర సుందరి బీజేపీ మహిళా మోర్చా నాయకురాలు సాహితీ రెడ్డి మిడ్జిల్ వైస్ ఎంపీపీ తిరుపతమ్మ రవి గౌడ్ బీజేపీ నాయకురాలు జ్యోతి, కృష్ణా భాయి, అంజలి పట్టణ అధ్యక్షుడు నాగరాజు మండల అధ్యక్షుడు రమేష్ జి నాయకులు నరేష్ వెంకట్, అమర్నాథ్ గౌడ్ బీజేపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed