కొత్త ఇల్లు కట్టుకోవాలనుకున్న భర్త..గొడ్డలితో నరికి చంపిన భార్య

by Naveena |
కొత్త ఇల్లు కట్టుకోవాలనుకున్న భర్త..గొడ్డలితో నరికి చంపిన భార్య
X

దిశ,నాగర్ కర్నూల్ /తెల్కపల్లి : నాగర్ కర్నూల్ జిల్లా తెలకపల్లి మండలం వట్టిపల్లి గ్రామంలో గొడ్డలితో నరికి హత్య చేయబడ్డ ఈశ్వరయ్య(56 ) కేసులో మిస్టరీ వీడింది. తన కుటుంబమే హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు తెలకపల్లి పోలీస్ స్టేషన్ లో సిఐ మీడియాతో మాట్లాడారు. వట్టిపల్లి గ్రామానికి చెందిన ఈశ్వరయ్య(56) ఎల్లమ్మ వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ముగ్గురు కూతుర్లు ఉన్నారు. ఈశ్వరయ్య కు సర్వే నెంబర్ 300 లో రెండు ఎకరాల 14 గుంటల భూమి ఉంది. అయితే ఆ భూములు అమ్మి వచ్చిన డబ్బుతో పూరి గుడిసె తీసేసి..కొత్త ఇల్లు కట్టుకొని ,పెళ్లికాని తన కూతుర్లకు పెళ్లిళ్లు చేయాలని అనుకున్నాడు. భూమి అమ్మకూడదని తన భార్య ఎల్లమ్మ,బామ్మర్ది బాలస్వామి ,పెద్ద కూతురు స్వాతి, పెద్ద అల్లుడు మల్లేష్ చెప్పారు. అయినా ఈశ్వరయ్య వినకుండా తాను అమ్మాలని నిర్ణయించుకున్నానని చెప్పాడు. దీంతో తమ మాట వినడంలేదని శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత అతని భార్య,బామ్మర్ది,పెద్ద కూతురు,పెద్దల్లుడు,మరదలు కలిసి గోడ్డలి తో విచక్షణారహితంగా హత్య చేశారు. అనంతరం అక్కడ నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటనపై మృతుడి చెల్లి విమల ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

Advertisement

Next Story

Most Viewed