- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నాగర్ కర్నూల్ పట్టణంలో ఘరానా మోసం
దిశ, నాగర్ కర్నూల్ :- నాగర్ కర్నూల్ జిల్లాలో ఘరానా మోసం వెలుగు చూసింది. ఇద్దరు యువతులు కొన్ని రోజులుగా పట్టణంలోని వ్యాపార దుకాణాలు తిరుగుతూ గూగుల్ లో షాప్ లొకేషన్, 19 డిగ్రీస్ కెమెరా ఫొటోస్ పెడతామని పలువురి వ్యాపారులతో డబ్బులు వసూలు చేస్తున్నారు. శుక్రవారం హౌసింగ్ బోర్డు లోని ఓ ఐస్ క్రీం పార్లర్ షాప్ లో యజమానికి మేం గూగుల్ నుంచి వచ్చామని నకిలీ ఐడి కార్డ్ చూయించి మాయ మాటలు చెప్పి అతని నుండి రూ.10 వేలు అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు. పక్కనే ఉన్న అతని స్నేహితునికి వారి ప్రవర్తనలో అనుమానం రావడంతో జిల్లా కేంద్రంలోని పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇచ్చాడు.
పోలీసులు అక్కడికి చేరుకుని ఇద్దరు యువతులను పోలీస్ స్టేషన్ కి తరలించారు. బాధిత వ్యాపారి వాళ్ళ ఐడి కార్డును పరిశీలించగా అది నకిలీ సంస్థ అని గుర్తించినట్లు తెలిపాడు. ఆఫర్ పేరుతో ఒక్కొ షాప్ వ్యాపారి దగ్గర నుంచి సుమారు రూ. 6 వేలు వసూలు చేసినట్లు వ్యాపారులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా జిల్లా కేంద్రంలోని ఓ లాడ్జిలో ఇద్దరు యువతులు ఉంటున్నట్టు సమాచారం. ఈ విషయంపై నాగర్ కర్నూల్ ఎస్సై గోవర్ధన్ ను ఫోన్ ద్వారా వివరణ కోరడానికి ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు.