లోక్ అదాలత్ సేవలను విస్తృతం చేయండి: సీనియర్ సివిల్ జడ్జి జి. శ్రీనివాస్

by Kalyani |
లోక్ అదాలత్ సేవలను విస్తృతం చేయండి: సీనియర్ సివిల్ జడ్జి జి. శ్రీనివాస్
X

దిశ, నారాయణపేట ప్రతినిధి : లోక్ అదాలత్ సేవలను విస్తృతం చేయాలని సీనియర్ సివిల్ జడ్జి జి. శ్రీనివాస్ అన్నారు. డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ నారాయణ పేట జిల్లా న్యాయస్థానాలలో లోక్ అదాలత్ సేవలను విస్తృతం చేయాలనే అంశంపై పోలీస్ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి మాట్లాడారు. రాజీమార్గం ద్వారానే కేసులను అధిక సంఖ్యలో పరిష్కారం చేయాలని జిల్లా పోలీస్ ఆధికారులకు విన్నవించారు. ప్రతి పోలీస్ స్టేషన్ లో జాతీయ లోక్ అదాలత్ గురించి సూచిక బోర్డులను పెట్టాలని ప్రజలకు రాజీమార్గం ద్వారా క్రిమినల్ కేసులు పరిష్కారం అయ్యే విధంగా కేసులను పరిష్కరించాలని కోరారు.

అధిక సంఖ్యలో పెండింగ్ లో ఉన్న పాత కేసులను మరియు డ్రంక్ అండ్ డ్రైవ్, ట్రాఫిక్ చలాన్ కేసులను పరిష్కారం చేయాలని ఈ కేసుల్లో కక్షదారులు రాజీ మార్గం ద్వారా సద్వినియోగం చేసుకోవాలని అయ సూచించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి సయ్యద్ జకీయా సుల్తానా, డీఎస్పీ కె. సత్యనారాయణ, జిల్లాలోని ఆయా సర్కిల్స్ కు చెందిన సీఐ, ఎస్ఐలు కోర్టు కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed